క్రీడాభూమి

విజయ్ హాజారే క్రికెట్ టోర్నీ చాంప్ తమిళనాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన తమిళనాడు కైవసం చేసుకుంది. సోమవారం నాటి ఫైనల్‌లో ఆ జట్టు బెంగాల్‌ను 37 పరుగుల తేడాతో ఓడించింది. సెంచరీతో కదంతొక్కిన తమిళనాడు వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు 47.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. దినేష్ 120 బంతులు ఎదుర్కొని, 14 ఫోర్లతో 112 పరుగులు చేశాడు. బాబా ఇంద్రజిత్ చేసిన 32 పరుగులు ఈ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక పరుగులుగా నమోదయ్యాయంటే, దినేష్ సెంచరీ ఎంత కీలకమైందో ఊహించుకోవచ్చు. బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించిన జాతీయ ఆటగాడు మహమ్మద్ షమీ 26 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చాడు. మరో ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండాకు మూడు వికెట్లు లభించాయి.
సుదీప్ ఒంటరిపోరు
టైటిల్ సాధించేందుకు 218 పరుగులు సాధించాల్సి ఉండగా, బెంగాల్ ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. సుదీప్ చటర్జీ ఒటరి పోరాటం కొనసాగించి 79 బంతుల్లో, ఐదు ఫోర్లతో 58 పరుగులు సాధించడాన్ని మినహాయిస్తే, ఆ జట్టు తరఫున ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్ మనోజ్ తివారీ 32 పరుగులకు వెనుదిరిగాడు. తమిళనాడు బౌలర్లు అశ్విన్ క్రీస్ట్, మహమ్మద్, రాహిల్ షా తలా రెండేసి వికెట్లు కూల్చారు.
సంక్షిప్త స్కోర్లు
తమిళనాడు ఇన్నింగ్స్: 47.2 ఓవర్లలో 217 ఆలౌట్ (దినేష్ కార్తీక్ 112, బాబా ఇంద్రజిత్ 32, మహమ్మద్ షమీ 4/26, అశోక్ దిండా 3/36).
బెంగాల్ ఇన్నింగ్స్: 45.5 ఓవర్లలో 180 ఆలౌట్ (సుదీప్ చటర్జీ 58, మనోజ్ తివారీ 32, అశ్విన్ క్రీస్ట్ 2/23, మహమ్మద్ 2/30, రాహిల్ షా 2/38).