క్రీడాభూమి

భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 20: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇక్కడ జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాదే పైచేయిగా కనిపించినప్పటికీ, చివరి రోజైన సోమవారం నాటి ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోమ్, ఆల్‌రౌండర్ షాన్ మార్ష్ అసాధారణ పోరాట ప్రతిభతో మ్యాచ్‌ని డ్రాగా ముగించగలిగారు. వీరిద్దరూ అర్ధ శతకాలు సాధించగా, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 204 పరుగులు చేసింది. మ్యాచ్‌ని డ్రా చేసుకోవడమే లక్ష్యంగా ఎంచుకున్న ఆస్ట్రేలియా వ్యూహాత్మకంగా ఆడగా, భారత బౌలర్లు ఎదురుదెబ్బ తీయలేకపోయారు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 451 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా టీమిండియా తొమ్మిది వికెట్లకు 603 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా కేవలం 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజైన సోమవారం ఆటను కొనసాగించినప్పుడు, భారత బౌలర్లు పైచేయి సాధిస్తారని అభిమానులు ఆశించారు. అందుకు తగినట్టుగానే, 59 పరుగుల వద్ద ఆస్ట్రేలియాను భారత్ దెబ్బతీయగలిగింది. ఓపెనర్ మాట్ రెన్‌షా (15)ను ఇశాంత్ శర్మ ఎల్‌బిగా అవుట్ చేశాడు. మరో నాలుగు పరుగుల తర్వాత కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (21) వికెట్ కూడా కూలింది. రవీంద్ర జడేజా అతనిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం షాన్ మార్ష్, హ్యాండ్స్‌కోమ్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఐదో వికెట్‌కు 124 పరుగులు జోడించారు. 197 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లతో 53 పరుగులు చేసిన అతను రవీంద్ర జడేజా బలింగ్‌లో మురళీ విజయ్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. అతను అర్ధ శతకం నమోదు చేసే క్రమంలో, హ్యాండ్స్‌కోమ్‌తో కలిసి ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించి, సఫలమయ్యాడు. భారత్ విజయావకాశాలకు గండికొట్టాడు. మార్ష్ అవుటైన తర్వాత గ్లేన్ మాక్స్‌వెల్ (2) తక్కువ పరుగులకే, అశ్విన్ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కు దొరికిపోయాడు. చివరిలో వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ (9 నాటౌట్)తో కలిసి మ్యాచ్‌ని డ్రాగా ముగించిన హ్యాండ్స్‌మ్ 200 బంతులు ఎదుర్కొని అజేయంగా 72 పరుగులు చేశాడు. అతని స్కోరులో ఏడు ఫోర్లు ఉన్నాయి. కాగా, నాలుగు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలి విజయాన్ని అందుకోగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. మూడో టెస్టు డ్రాకావడంతో, ధర్మశాలలో ఈనెల 25 నుంచి 29 వరకు జరిగే చివరిదై నాలుగో టెస్టు ప్రాధాన్యతను సంతరించుకుంది.
భారత్‌లో జరిగిన ఒక టెస్టులో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓటమిపాలైన వెంటనే జరిగిన మ్యాచ్‌లో మళ్లీ పుంజుకొని డ్రాగా ముగించడం ఆస్ట్రేలియాకు ఇది మూడోసారి. 1979లో ఢిల్లీ, 1986లో ముంబయి టెస్టుల్లో ఆసీస్ ఇదే విధంగా భారీ ఓటమి తర్వాత నిలదొక్కుకొని, తర్వాతి మ్యాచ్‌లను డ్రాగా ముగించింది.

స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 137.3 ఓవర్లలో 451 ఆలౌట్ (రెన్‌షా 44, స్టీవెన్ స్మిత్ 178 నాటౌట్, గ్లేన్ మాక్స్‌వెల్ 104, ఉమేష్ యాదవ్ 3/106, రవీంద్ర జడేజా 5/124).
భారత్ తొలి ఇన్నింగ్స్: 210 ఓవర్లలో 9 వికెట్లకు 603 డిక్లేర్డ్ (లోకేష్ రాహుల్ 67, మురళీ విజయ్ 82, చటేశ్వర్ పుజారా 202, వృద్ధిమాన్ సాహా 117, రవీంద్ర జడేజా 54 నాటౌట్, పాట్ కమిన్స్ 4/106, స్టీవ్ ఒకీఫ్ 3/199.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 2 వికెట్లకు 23): డేవిడ్ వార్నర్ బి రవీంద్ర జడేజా 14, మాట్ రెన్‌షా ఎల్‌బి ఇశాంత్ శర్మ 15, నాథన్ లియాన్ బి రవీంద్ర జడేజా 2, స్టీవెన్ స్మిత్ బి రవీంద్ర జడేజా 21, షాన్ మార్ష్ సి మురళీ విజయ్ బి రవీంద్ర జడేజా 53, పీటర్ హ్యాండ్స్‌కోమ్ 72 నాటౌట్, గ్లేన్ మాక్స్‌వెల్ సి మురళీ విజయ్ బి అశ్విన్ 2, మాథ్యూ వేడ్ 9 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం (100 ఓవర్లలో 6 వికెట్లకు) 204.
వికెట్ల పతనం: 1-17, 2-23, 3-59, 4-63, 5-187, 6-190.
బౌలింగ్: అశ్విన్ 30-10-71-2, రవీంద్ర జడేజా 44-18-54-4, ఉమేష్ యాదవ్ 15-2-36-0, ఇశాంత్ శర్మ 11-0-30-1.

చిత్రం.. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోమ్