క్రీడాభూమి

కివీస్‌కే వనే్డ సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, ఫిబ్రవరి 8: ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన అత్యంత కీలక, చివరి వనే్డలో 55 పరుగులతో గెలిచిన న్యూజిలాండ్ సిరీస్‌ను 2-1 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. వనే్డ ఫార్మెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్‌కు విజయంతో ఘనంగా వీడ్కోలు పలికేందుకు న్యూజిలాండ్ ఆటగాళ్లు విశేషంగా శ్రమించారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. ఒకానొక దశలో వికెట్ నష్టం లేకుండా 84 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఆతర్వాత అదే స్థాయిలో రాణించలేకపోయింది. మార్టిన్ గుప్టిల్ 61 బంతుల్లో 59 పరుగులు చేయగా, కేవలం 27 బంతులు ఎదుర్కొన్న మెక్‌కలమ్ ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 47 పరుగులు సాధించాడు. మిడిల్ ఆర్డర్‌లో గ్రాంట్ ఇలియట్ 50 పరుగులు చేశాడు. అయితే, లోయర్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో న్యూజిలాండ్ భారీ స్కోరును చేయలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ మార్ష్ 34 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. జొస్ హాజెల్‌వుడ్, జాన్ హాస్టింగ్స్, స్కాట్ బోలాండ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
న్యూజిలాండ్‌ను ఓడించి, సిరీస్‌ను సాధించాలన్న పట్టుదలతో 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా అనూహ్యంగా విఫలమైంది. 43.4 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 41, జార్జి బెయిలీ 33 పరుగులతో జట్టును ఆదుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుత ప్రతిభ కనబరచి ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. మాట్ హెన్రీ 60 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. కొరీ ఆండర్సన్, ఇష్ సోధీ చెరి 2 వికెట్లు సాధించారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 45.3 ఓవర్లలో ఆలౌట్ 246 (మార్టిన్ గుప్టిల్ 59, బ్రెండన్ మెక్‌కలమ్ 47, గ్రాంట్ ఇలియట్ 50, మిచెల్ మార్ష్ 3/34, హాజెల్‌వుడ్ 2/45, హాస్టింగ్స్ 2/42, బోలాండ్ 2/59).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 43.4 ఓవర్లలో ఆలౌట్ 191 (ఉస్మాన్ ఖాజా 44, జార్జి బెయిలీ 33, మిచెల్ మార్ష్ 41, మాట్ హెన్రీ 3/60, ఆండర్సన్ 2/16, సోధీ 2/31).

సిక్సర్ల ‘డబుల్ సెంచరీ’
హామిల్టన్: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 200 సిక్సర్లను పూర్తి చేసి, అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. ఆస్ట్రేలియాతో సోమవారం చివరి వనే్డను ఆడిన అతనికి కెరీర్‌లో ఇదే ఆఖరి వనే్డ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లోనే అతను 47 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతను మూడు సిక్సర్లు కొట్టాడు. 260 వనే్డలో అతనికి ఇది కెరీర్‌లో 200వ సిక్సర్. కెరీర్‌లో అత్యధికంగా వనే్డ సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో షహీద్ అఫ్రిదీ (పాకిస్తాన్/ 351) అగ్రస్థానంలో ఉండగా, సనత్ జయసూర్య (శ్రీలంక/ 270), క్రిస్ గేల్ (వెస్టిండీస్/ 238) వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు. మెక్‌కలమ్ నాలుగో స్థానానికి చేరాడు. టెస్టుల్లో అతను 100 సిక్సర్లు కొట్టి, ఈ ఫార్మెట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)తో కలిసి నంబర్ వన్ స్థానాన్ని పంచుకుంటున్నాడు. క్రిస్ గేల్ (వెస్టిండీస్) 98 సిక్సర్లతో రెండు, జాక్వెస్ కాలిస్ (దక్షిణాఫ్రికా) 97 సిక్సర్లతో మూడు స్థానాలను ఆక్రమించారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత మెక్‌కలమ్ ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ముందు నడవగా, మిగతా వారంతా అతనిని అనుసరిస్తూ పెవిలియన్‌కు వెళ్లారు. అతను స్టాండ్స్ వద్దకు వచ్చిన వెంటనే పలువురు క్రికెటర్లు, అధికారులు అతనికి ఆలింగనం చేసుకున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు హర్షధ్వానాలతో మెక్‌కలమ్‌కు వీడ్కోలు పలికారు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత బలంగా బంతిని కొట్టే హార్డ్ హిట్టర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న మెక్‌కలమ్ తన కెరీర్‌లో 254 వనే్డలు ఆడి 5,909 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. 166 పరుగులు అతని అత్యధిక స్కోరు. 258 క్యాచ్‌లు పట్టిన అతను 15 స్టంపింగ్స్ చేశాడు. ఆస్ట్రేలియాతో తన చివరి వనే్డ ఆడతానని ఇది వరకే ప్రకటించిన మెక్‌కలమ్ సోమవారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఫార్మెట్‌లో కెరీర్‌ను ముగించాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్ కూడా అతనికి కెరీర్‌లో చివరిది.

కెరీర్‌లో చివరి వనే్డ ఆడిన తర్వాత సహచరులతో కలిసి బయటకు వస్తున్న కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్