క్రీడాభూమి

దక్షిణాఫ్రికా 314 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, మార్చి 26: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 314 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజు ఆటకు వర్షం కారణంగా ఆటంకం కలగ్గా, 41 ఓవర్లు మాత్రమే బౌల్‌కాగా, దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లకు 123 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి 89.2 ఓవర్లలో ఆలౌటైంది. షహీం ఆమ్లా మొదటి రోజు అర్ధ శతకాన్ని సాధించగా, రెండో రోజు ఆటలో కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ (53), క్వింటన్ డికాక్ (90) హాఫ్ సెంచరీలు సాధించారు. చివరిలో కాగిసో రబదా 34 పరుగులు చేయడం విశేషం. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 93 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. నీల్ వాగ్నర్ మూడు, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 2 వికెట్లు కూల్చారు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 67 పరుగులు చేసింది. టామ్ లాథమ్ 42, జీత్ రావల్ 25 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.