క్రీడాభూమి

ప్రీ క్వార్టర్స్‌కు ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, మార్చి 26: ఇక్కడ జరుగుతున్న మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ ప్రీ క్వార్టర్స్ చేరాడు. ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించి, కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్‌ను అందుకొని, ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరిన అతను రెండో రౌండ్‌లో ఫ్రానె్స టిఫోను 7-6, 6-3 తేడాతో ఓడించి ముందంజ వేశాడు. మరో మ్యాచ్‌లో నంబర్ వన్ సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా 6-3, 6-4 స్కోరుతో హొరాసియో సెబాలస్‌ను ఓడించాడు. ఆరో ర్యాంక్ ఆటగాడు డామినిక్ థియేమ్‌కు రెండో రౌండ్‌లోనే చుక్కెదురైంది. బొమా కోరిక్ అతనిని 6-1, 7-5 ఆధిక్యంతో ఓడించాడు. పదో సీడ్ థామ్ బెర్డిచ్ 6-3, 6-2 తేడాతో ఆండ్రీ రబ్లెవ్‌పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో, డామియర్ జుంహుర్‌పై నిక్ కిర్గియోస్, మిఖెయిల్ కుకుషిన్‌పై రాబర్టొ బటిస్టా అగుట్, యెన్ సన్ లూపై అలెగ్జాండర్ జ్వెరెవ్, ఆండ్రీ కుజ్నెత్సొవ్‌పై ఇవో కార్లోవిచ్, తొమాజ్ బెలూసీపై జాన్ ఇస్నర్, టామీ రొబ్రెడోపై శామ్ క్వెర్రీ, ఆండ్రియాస్ సెప్పీపై డిగో స్వాట్జ్‌మన్, ఫెలిసియానో లొపెజ్‌పై మాలెక్ జైరీ విజయాలను నమోదు చేశారు. కాగా, మహిళల సింగిల్స్‌లో రెండో ర్యాంకర్ కరొలినా ప్లిస్కోవా 7-5, 6-3 స్కోరుతో యూలియా పుతిన్‌త్సెవాను ఓడించింది. నాలుగో సీడ్ డొమినికా సిబుల్కొవా 6-2, 6-3 ఆధిక్యంతో క్రిస్టెన్ ఫ్లిప్‌కెన్స్‌పై, వర్జీనా లూసిక్ బరోనా 6-0, 6-3 స్కోరుతో అగ్నీస్కా రద్వాన్‌స్కాపై విజయాలను నమోదు చేశారు. ఆరో సీడ్ గార్బినె ముగురుజా 4-6, 6-2, 6-3 తేడాతో షుయ్ జాంగ్‌పై గెలిచింది. కరోలినా వొజ్నియాకి 6-4, 6-2 స్కోరుతో సొరానా సిర్‌స్టియాను ఓడించింది. బార్సరా స్ట్రయికోవా 6-2, 6-4 తేడాతో జనా సెపెలొవాపై గెలిచింది. బెథానీ మాంటెక్ సాండ్స్ 4-6, 6-0, 6-4 స్కోరుతో అనస్టాసియా పవ్లిచెన్కొవాపై విజయం సాధించింది.

చిత్రం.. రోజర్ ఫెదరర్