క్రీడాభూమి

పుజారా 15వ టెస్టు హాఫ్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చటేశ్వర్ పుజారా కెరీర్‌లో 15వ టెస్టు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాపై అతనికి ఇది ఆరోది. ఆసియా ఖండంలో అతను మొత్తం 31 టెస్టులు ఆడి, 66.86 సగటుతో 2,942 పరుగులు చేశాడు. వీటిలో పది శతకాలు, 12 అర్ధ శతకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాపై పుజారా 12 టెస్టుల్లో 1,101 పరుగులు సాధించాడు. 57.94 సగటుతో రాణించిన అతని స్కోరులో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంతకు ముందు ఇంగ్లాండ్‌పై 14 టెస్టుల్లో 1,061 పరుగులు చేసిన అతను ఆస్ట్రేలియాపై ఆ మైలురాయిని అధిగమించాడు.
ప్రస్తుత సిరీస్‌లో పుజారా 67.50 సగటుతో 405 పరుగులు చేశాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో అందరి కంటే అతనే ఎక్కువ పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మాత్రమే పుజారా కంటే ఎక్కువగా, 482 పరుగు చేశాడు.

చిత్రం..చటేశ్వర్ పుజారా