క్రీడాభూమి

లియాన్‌కు నాలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 26: స్పిన్నర్ నాథన్ లియాన్ నాలుగు వికెట్లు కూల్చి, భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో, ఇక్కడ జరుగుతున్న చివరి, నాలుగో టెస్టు, రెండో రోజు ఆటలో ఆసీస్ కొంత వరకు పైచేయి సాధించింది. లోకేష్ రాహుల్, చటేశ్వర్ పుజారా అర్ధ శతకాలను నమోదు చేసినప్పటికీ, 91 ఓవర్లలో 248 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఎదురీదుతోంది. ఆసీస్ కంటే ఇంకా 52 పరుగులు వెనుకంజలో ఉన్న భారత్ చేతిలో నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి. మొదటి రోజు ఆటలో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 300 పరుగుల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ ఒక ఓవర్ మాత్రమే ఆడింది. రాహుల్ ఆ ఓవర్‌ను రక్షణాత్మకంగా ఆడాడు. మొత్తం మీద, పరుగుల ఖాతా తెరవకుండా, వికెట్ నష్టం లేకుండా రెండో రోజు ఆటను మొదలుపెట్టిన భారత్ 21 పరుగుల వద్ద మురళీ విజయ్ వికెట్‌ను కోల్పోయింది. అతను 36 బంతుల్లో 11 పరుగులు చేసి, జొస్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ చక్కటి క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారాతో కలిసి రాహుల్ ఇన్నింగ్సను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రెండో వికెట్‌కు 87 పరుగులు జత కలిసిన తర్వాత, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు చిక్కిన రాహుల్ పెవిలియన్ చేరాడు. అతను 124 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు చేశాడు. కోహ్లీ స్థానంలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న అజింక్య రహానే సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి, పుజారాతో కలిసి మూడో ఇవకెట్‌కు 49 పరుగులు జోడించాడు. పుజారా 151 బంతుల్లో 57 పరుగులు చేసి, లియాన్ బౌలింగ్‌లో పీటర్ హ్యాండ్స్‌కోమ్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అతని స్కోరులో ఆరు ఫోర్లు ఉన్నాయి. కరుణ్ నాయర్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, కేవలం ఐదు పరుగులు చేసి, లియాన్ బౌలింగ్‌లోనే వేడ్‌కు దొరికాడు. వికెట్ వద్ద నిలదొక్కుకుంటున్న సమయంలోనే రహానేను లియాన్ అవుట్ చేశాడు. 46 పరుగులు చేన అతను ఇచ్చిన క్యాచ్‌ని ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ పట్టాడు. కొంత సేపు ధాటిగా ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 30 పరుగులు చేసి, లియాన్ వేసిన బంతిని అర్థం చేసుకోలేక వికెట్లకు అడ్డంగా దొరికిపోయాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లకు 248 పరుగులు చేయగా, వృద్ధిమాన్ సాహా 10, రవీంద్ర జడేజా 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మొత్తం మీద రెండు జట్లు పో టాపోటీగా ఆడుతున్న నేపథ్యంలో, మూడో రోజు ఆట అత్యంత ప్రాధాన్యత ను సంతరించుకుంది.

చిత్రం.. నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ను కట్టడి చేసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్