క్రీడాభూమి

ఈ విజయం కుర్రాళ్లదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 28: ప్రస్తుత జట్టు విదేశాల్లో సైతం ఓ సీజన్ అంతా రాణించినప్పుడు తన ముఖంపై చిరునవ్వు కాకుండా మరింత పెద్ద నవ్వును చూడగలుగుతారని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఇటీవలి కాలంలో అత్యంత సుదీర్ఘ హోమ్ సిరీస్‌లో జరిగిన 13 టెస్టుల్లో 10 టెస్టులను గెలుచుకున్నా మీరు సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు, ఎందుకని? అని ప్రశ్నించగా ఇది దేనికీ ముగింపు కాదనే దానికి ఇదో చక్కటి ఉదాహరణ అని కోహ్లీ అన్నాడు. ప్రపంచ నంబర్ వన్ జట్టు అయినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ తమ అసలైన సవాలు ఇప్పుడే మొదలవుతుందని ఆయన అన్నాడు. అయిదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలన్నది రహానే ఆలోచనేనని,కుల్దీప్ యాదవ్ చక్కగా రాణించాడని కోహ్లీ కితాబు ఇచ్చాడు. ఈ విజయంలో జట్టులోని ప్రతి ఒక్కరి పాత్ర ఉందని అంటూ, ఆటగాళ్లంతా జట్టుగా రాణించారన్నాడు.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇక ఎంతమాత్రం స్నేహితులు కాదని కోహ్లీ స్పష్టం చేశాడు. మైదానం వెలుపల ఆస్ట్రేలియా క్రికెటర్లను ఇప్పటికీ మిత్రులుగా పరిగణిస్తారా అని అడగ్గా, లేదని కోహ్లీ నిర్మొహమాటంగా చెప్పాడు. మిత్రత్వం ఉంటుందని తాను మొదట్లో అనుకున్నానని, అయితే ఇప్పుడు ఆ వైఖరి మారిపోయిందని అన్నాడు. సిరీస్ ప్రారంభం కావడానికి తాను చెప్పిన మాట పూర్తిగా తప్పని తేలిపోయిందని అన్నాడు. తనపై ఆస్ట్రేలియా మీడియాలో వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ, కొందరు ఇంట్లో కూర్చుని ఇలాంటివి రాస్తారని, మైక్ పట్టుకుని మాట్లాడేస్తూ ఉంటారని అంటూ, మైదానంలోకి దిగి బ్యాటింగ్, బౌలింగ్ చేసినప్పుడు వారు ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొన్నారనే విషయం తెలుస్తుందన్నాడు. విమర్శిస్తే చూస్తూ ఊరుకోవడం తనకు చేతకాదని అంటూ, సమాధానం ఎలా ఉంటుందో చూపించామని కోహ్లీ అన్నాడు.

చిత్రం..ఆద్యంతం తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగిన నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్ ముగిసిన అనంతరం మైదానంలో కరచాలనం చేస్తున్న భారత్, ఆసీస్ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్