క్రీడాభూమి

విదేశీ గడ్డపైనా రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 28: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా విదేశీ గడ్డపైన కూడా రాణించాలని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డాడు. సొంత గడ్డపై ప్రత్యర్థి జట్లను వరసగా ఓడించిన కోహ్లీ సేన ఇక విదేశాల్లో సైతం ఇలాంటి ఫలితాలనే సాధించాలని అభిలషిస్తూ, విదేశాల్లో గెలిస్తే ఆ సంతృప్తే వేరుగా ఉంటుందన్నాడు. ‘మేము ఎప్పుడూ చేయాలనుకునేది అదే. మనం పెట్టుకోవలసిన పరీక్ష కూడా అదే. సొంతగడ్డపై అడ్వాంటేజిలు ఉంటాయి గనుక ఇక్కడ రాణించడం బాగానే ఉంటుంది. అయితే విదేశాల్లో గెలిస్తే ఆ సంతృప్తే వేరుగా ఉంటుంది’ అని గవాస్కర్ అన్నాడు. కోహ్లీ జట్టు కోచ్ కుంబ్లే మార్గదర్శకత్వంలో సరయిన మార్గంలోనే నడుస్తోందని ఆయన అభిప్రాయ పడ్డాడు. ‘అతను గొప్ప అనుభవశాలే కాకుండా దూకుడు స్వభావం కూడా ఉన్న వ్యక్తి. అదే తరహా దూకుడును మన బౌలర్లు ప్రదర్శించారు’ అని గవాస్కర్ చెప్పాడు. ముఖ్యంగా ఉమేశ్ యాదవ్ అద్భుతంగా రాణించాడని, మొత్తం 13 మ్యాచ్‌లలో 12 మ్యాచ్‌లు ఆడిన అతను భారత జట్టు మూడు కీలక సిరీస్‌లు గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడన్నాడు. అయితే రొటేషన్ పద్ధతిలో ఆడించడం వల్ల పేస్ వనరులు సజీవంగా ఉంటాయని చెప్పాడు. రహానే, పుజారా, కెఎల్ రాహుల్‌లను కూడా ఆయన ప్రశంసించాడు. గాయం కారణంగా కీలకమైన నాలుగో టెస్టుకు కోహ్లీ అందుబాటలో లేక పోయిన రహానే అద్భుతంగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడని, పరిస్థితులను నియంత్రణలో ఉంచుకున్నాడని గవాస్కర్ ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ అన్నారు.