క్రీడాభూమి

చివరి టెస్టుపై కివీస్ పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, మార్చి 28: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పట్టు బిగించింది. 4 వికెట్ల నష్టానికి 321 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ కాన్ విలియమ్‌సన్ (176), మరో నైట్ వాచ్‌మన్ మైఖేల్ సాంట్నర్ (41) 82 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరి నిష్క్రమణ అనంతరం బిజె.వాట్లింగ్ 24 పరుగులు, మ్యాట్ హెన్రీ 12 పరుగులు, జీతన్ పటేల్ 5 పరుగులు సాధించి వెనుదిరగ్గా అర్థ శతకంతో రాణించిన కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక క్వింటన్ డీకాక్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 162.1 ఓవర్లలో 489 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్ జట్టు 175 పరుగుల ఆధిక్యత సాధించింది.
అనంరతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ప్రత్యేకించి జీతన్ పటేల్ 22 పరుగులకే 2 వికెట్లు కైవసం చేసుకోగా, గ్రాండ్‌హోమ్, హెన్రీ ఒక్కో వికెట్‌తో ప్రత్యర్థుల వెన్ను విరిచారు. వీరి జోరును ప్రతిఘటించడంలో దక్షిణాఫ్రికా జట్టు ఘోరంగా విఫలమైంది. ఓపెనర్లు డీన్ ఎల్గర్ (5), థెయునిస్ డీబ్రుయిన్ (12) సహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు హషీమ్ ఆమ్లా (19), జెపి.డుమినీ (13), టెంబా బవుమా (1) స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు పరుగెత్తగా, కెప్టెన్ డుప్లెసిస్ (15), వికెట్‌కీపర్ క్వింటన్ డీకాక్ (15) అజేయంగా నిలిచారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే రాబట్టిన దక్షిణాఫ్రికా జట్టు ఇంకా 95 పరుగులు వెనుకబడి ఓటమికి ఎదురీదుతోంది.

చిత్రం..జీతన్ పటేల్ (2/22)ను అభినందిస్తున్న కివీస్ ఆటగాళ్లు