క్రీడాభూమి

అశ్విన్‌కు సోబర్స్ ట్రోఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 28: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంగళవారం ప్రతిష్టాత్మకమైన గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఈ ఏడాది అశ్విన్‌ను అత్యుత్తమ క్రికెటర్‌గానూ, అత్యుత్తమ టెస్టు క్రికెటర్‌గానూ ప్రకటించడంతో అతడిని ఈ ట్రోఫీ వరించింది. ఐసిసి తనను రెండు అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఈ అవార్డులను అందుకోవడం కలలా అనిపిస్తోందని అశ్విన్ తెలిపాడు. 2015లో ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు బౌలర్‌గా నిలిచిన అశ్విన్ 2016లో మరో రెండుసార్లు నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న విషయం విదితమే. 2015 సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 2016 సెప్టెంబర్ 20వ తేదీ వరకు కొనసాగిన ఓటింగ్ పిరియడ్‌లో ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు ఆడి 48 వికెట్లు, 336 పరుగులు సాధించడంతో పాటు 19 అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌లలో 27 వికెట్లు రాబట్టుకున్నాడు. ఇంత గొప్పగా రాణించడంలో తనకు సహాయ సహకారాలు అందజేసిన భారత జట్టులోని సహచర సభ్యులతో పాటు జట్టు యాజమాన్యానికి, సపోర్టింగ్ స్ట్ఫాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని, భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించి మరిన్ని మ్యాచ్‌లలో టీమిండియా విజయం సాధించేందుకు తనవంతు తోడ్పాటును అందజేయగలనని ఆశిస్తున్నానని అశ్విన్ తెలిపాడు.

చిత్రం..ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్టు క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్-2016 అవార్డులను అందుకొన్న భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్