క్రీడాభూమి

చాంపియన్‌షిప్ మేస్ మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 28: ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్ మేస్‌ను టీమిండియా నిలబెట్టుకుంది. కటాఫ్ తేదీగా ఉన్న ఏప్రిల్ 1 నాటికి వార్షిక ప్రపంచ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచినందుకు భారత జట్టు ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్ మేస్‌తో పాటు 10 లక్షల డాలర్ల నగదు బహుమతిని కూడా గెలుచుకుంది. ధర్మశాలలో మంగళవారం ఆస్ట్రేలియాపై నిర్ణాయక నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా టెస్టు చాంపియన్‌షిప్ మేస్‌ను, 10 లక్షల డాలర్ల నగదు బహుమతి చెక్కును అందుకున్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రతిష్టాత్మక టెస్టు చాంపియన్‌షిప్ మేస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు దానిని నిలబెట్టుకునేందుకు కనీసం ఒక మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో పోరాటాన్ని ప్రారంభించిన విషయం విదితమే. అయితే 2-1 తేడాతో కంగారూలను ఓడించి ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు ప్రపంచ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవడం ద్వారా టెస్టు చాంపియన్‌షిప్ మేస్‌ను నిలబెట్టుకుందని ఐసిసి (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
టెస్టు చాంపియన్‌షిప్ మేస్‌ను అందుకున్న అనంతరం భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచినందుకు ఎంతో సంతోషిస్తున్నామని తెలిపాడు. క్రికెట్‌లో ఏ జట్టు పటిమకైనా టెస్టు మ్యాచ్‌లే గీటురాయి అని, ప్రపంచంలో భారత జట్టే అత్యుత్తమమైనదని తాము నిరూపించగలిగినందుకు ఎంతో గర్వపడుతున్నామని చెప్పాడు.
కాగా, ఈ ఏడాది ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లు ఏవన్నదీ ప్రస్తుతం హామిల్టన్‌లో ఆతిథ్య న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ పూర్తయిన తర్వాత తేలుతుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించినా లేక డ్రాగా ముగించినా ఆ జట్టు రెండో స్థానంలో నిలుస్తుంది. అలాకాకుండా న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా జట్టు ఓటమి పాలైన పక్షంలో ఆస్ట్రేలియా జట్టును రెండో ర్యాంకు వరిస్తుంది. వార్షిక ర్యాంకుల్లో రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 5 లక్షల డాలర్లు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 2 లక్షల డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు లక్ష డాలర్లు చొప్పున నగదు బహుమతులను అందజేస్తారు.

చిత్రం..ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్ మేస్‌ను అందుకొంటున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ