క్రీడాభూమి

సూపర్ ఛాంప్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 28: లాంఛనం పూర్తయింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. స్వదేశంలో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా మంగళవారం ధర్మశాలలో ముగిసిన నిర్ణాయక చివరి మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించి 2-1 తేడాతో ఈ సిరీస్‌ను గెలుచుకుంది. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 2015 నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇంతకుముందు శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లపై విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు అదే జోరుతో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును కూడా చిత్తుచేసి వరుసగా ఏడో టెస్టు సిరీస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 106 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని చేరుకునేందుకు 87 పరుగుల దూరంలో నిలిచి మంగళవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టులో ఓపెనర్ లోకేష్ రాహుల్ ఆరంభం నుంచే బౌండరీలతో విజృంభించి ఈ సిరీస్‌లో ఆరో అర్థ శతకంతో తన పోరాటాన్ని ఘనంగా ముగించాడు. దీంతో భారత జట్టు మూడు రోజుల ఒక సెషన్‌కే ఈ మ్యాచ్‌ను ముగించి స్వదేశంలో తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకుంది. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటుకున్న రవీంద్ర జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.
అంతకుముందు నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ మురళీ విజయ్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక మాథ్యూ వేడ్‌కు దొరికిపోగా, అతని స్థానంలో వచ్చిన ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా (0) పరుగుల ఖాతా ఆరంభించకుండానే రనౌట్‌గా నిష్క్రమించాడు. దీంతో టీమిండియా కాస్త తడబాటుకు గురైనప్పటికీ తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే ఒకవైపు రాహుల్ (110 బంతుల్లో 51 పరుగులు-నాటౌట్)కు తోడ్పాటును అందిస్తూనే మరోవైపు ఆసీస్ బౌలర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి 27 బంతుల్లోనే 38 పరుగులతో హోరెత్తించాడు. మూడో వికెట్‌కు వీరు అజేయంగా 60 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసి 23.5 ఓవర్లలోనే భారత జట్టుకు విజయాన్ని అందించారు. చివర్లో రాహుల్ మూడు పరుగులు సాధించి ఈ మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. దీంతో భుజానికి తగిలిన గాయం కారణంగా పెవిలియన్‌లో కూర్చున్న రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా సభ్యులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో రాహుల్‌ను అభినందించారు. ఆ తర్వాత రాహుల్ తన హెల్మెట్‌ను కూడా తీయకుండానే కంగారూల డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగెత్తి బిగ్గరగా విజయనాదం చేశాడు. ఇది ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య తీవ్రస్థాయిలో సాగిన ఉద్రిక్తతలకు నిదర్శనంగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఇరు జట్ల కెప్టెన్లతో పాటు జట్ల సభ్యులు తమ విభేదాలన్నింటినీ పక్కన పెట్టి సాదరంగా కరచాలనం చేసుకున్నారు.
*
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 88.3 ఓవర్లలో 300 ఆలౌట్.
భారత్ తొలి ఇన్నింగ్స్: 118.1 ఓవర్లలో 332 ఆలౌట్.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 53.5 ఓవర్లలో 137 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 106 పరుగులు): లోకేష్ రాహుల్ నాటౌట్ 51, మురళీ విజయ్ (సి) మాథ్యూ వేడ్ (బి) ప్యాట్ కమ్మిన్స్ 8, చటేశ్వర్ పుజారా రనౌట్ (గ్లెన్ మ్యాక్స్‌వెల్) 0, అజింక్యా రహానే నాటౌట్ 38, ఎక్స్‌ట్రాలు: (బైస్ 4, లెగ్‌బైస్ 5) 9, మొత్తం: 23.5 ఓవర్లలో 106/2. వికెట్ల పతనం: 1-46, 2-46. బౌలింగ్: ప్యాట్ కమ్మిన్స్ 8-2-42-1, జోష్ హాజెల్‌వుడ్ 6-2-14-0, స్టీవ్ ఒకీఫ్ 4.5-1-22-0, నాథన్ లియోన్ 5-0-19-0.

చిత్రం..బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో సంబరాల్లో మునిగిపోయన టీమిండియా ఆటగాళ్లు