క్రీడాభూమి

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దిగజారిన బాంబ్రీ, సోమ్‌దేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాడు యూకీ బాంబ్రీతో పాటు సోమ్‌దేవ్ దేవర్మన్ స్థానాలు స్వల్పంగా పతనమయ్యాయి. భారత్‌లో నెంబర్ వన్ సింగిల్స్ ఆటగాడిగా కొనసాగుతున్న బాంబ్రీ తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారి 93వ ర్యాంకుకు చేరుకోగా, సోమ్‌దేవ్ కూడా రెండు ర్యాంకులు దిగజారి 181వ స్థానానికి చేరుకున్నాడు. అయితే భారత్‌లో రెండో ర్యాంకు ఆటగాడిగా కొనసాగుతున్న మరో యువ ఆటగాడు సాకేత్ మైనేని మాత్రం ఈ జాబితాలో యధాతథంగా 171వ స్థానంలోనే నిలిచాడు. కాగా, ఇటీవల గ్వాలియర్‌లో జరిగిన ఐటిఎఫ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన రామ్‌కుమార్ రామనాథన్ మాత్రం తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 13 స్థానాలు ఎగబాకి 260వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక డబుల్స్ విభాగంలో భారత స్పెషలిస్టు ఆటగాళ్ల ర్యాంకింగులేమీ మారలేదు. రోహన్ బొపన్న 9వ ర్యాంకులోనూ, సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ 41వ ర్యాంకులోనూ, పురవ్ రాజా 93వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. అయితే డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని రెండు ర్యాంకులు దిగజారి 126వ స్థానానికి, ఎడమచేతి వాటం ఆటగాడు దివిజ్ శరణ్ మూడు ర్యాంకులు పతనమై 134వ స్థానానికి చేరుకున్నారు.
ఇదిలావుంటే, ఈ ఏడాది రెండు గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు సహా మొత్తం 9 టైటిళ్లు సాధించిన హైదరాబాద్ బ్యూటీ సానియా మీర్జా మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలసి ఆమె ఈ స్థానాన్ని పంచుకుంటోంది. ప్రస్తుతం వీరిద్దరి ఖాతాలో చెరో 11,355 పాయింట్లు ఉన్నాయి. ఇక మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అంకితా రైనా 255వ స్థానంలోనూ, ప్రేరణ బాంబ్రీ 473వ స్థానంలోనూ ఉన్నారు.