క్రీడాభూమి

షోయబ్ మాలిక్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయానా, ఏప్రిల్ 12: వెస్టిండీస్‌తో జరిగిన చివరి, మూడో వనే్డ ఇంటర్నేషనల్‌ను ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న పాకిస్తాన్ ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 234 పరుగుల లక్ష్యాన్ని పాక్ సులభంగా ఛేదించడంలో సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ కీలక పాత్ర పోషించాడు. అతను సెంచరీ చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. షాయ్ హోప్ (71), జాసన్ మహమ్మద్ (59) అర్ధ శతకాలతో రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో నిలదొక్కుకొని, వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఆ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్, జునైద్ ఖాన్, షాదాబ్ ఖాన్ తలా రెండేసి వికెట్లు కూల్చారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ మరో 41 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేరింది. ఆరంభంలో కమ్రాన్ అక్మల్ (0), మహమ్మద్ షెజాద్ (3), బాబర్ ఖాన్ (16) వికెట్లు త్వరత్వరగా కూలినప్పటికీ, మహమ్మద్ హఫీజ్, షోయమ్ మాలిక్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ విండీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు దూకించారు. నాలుగో వికెట్‌కు 113 పరుగులు జోడించిన తర్వాత ఆష్లే నర్స్ బౌలింగ్‌లో పెరుమాళ్ క్యాచ్ అందుకోగా హఫీజ్ అవుటయ్యాడు. అతను 86 బంతులు ఎదుర్కొని, 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్‌కీపర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ (24 నాటౌట్)తో కలిసి మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడిన షోయబ్ మాలిక్ 111 బంతులు ఎదుర్కొని అజేయంగా 101 పరుగులు చేశాడు. అతని స్కోరులో పది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అతనిని వరించింది.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 (షయ్ హోప్ 71, జాసన్ మహమ్మద్ 59, మహమ్మద్ అమీర్ 2/41, జునైద్ ఖాన్ 2/60, షాదాబ్ ఖాన్ 2/57).
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 43.1 ఓవర్లలో 4 వికెట్లకు 236 (మహమ్మద్ హఫీజ్ 81, షోయబ్ మాలిక్ 101 నాటౌట్).