క్రీడాభూమి

టి-20 వరల్డ్ కప్‌లో ఆడడంపై వారంలోగా నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆడాలా? వద్దా? అనే విషయంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ప్రకటించింది. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో, చాలాకాలంగా ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతూ వస్తున్నది. గత ఏడాది డిసెంబర్‌లోగా పాకిస్తాన్‌తో పూర్తిస్థాయి సిరీస్‌లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, చివరి క్షణం వరకూ తాత్సారం చేసి, చివరికి మొండిచేయి చూపిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)పై పిసిబి గుర్రుగా ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడకపోతే, భవిష్యత్తులో భారత్ ఆడే ఏ స్థాయి మ్యాచ్‌ల్లోనూ ఆడబోమని ఒకానొక దశలో పిసిబి హెచ్చరించింది. అయితే, భారత్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కొంత మెత్తబడింది. ఇప్పుడు టి-20 వరల్డ్ చాంపియన్‌షిప్ భారత్‌లో జరగనుండడంతో జట్టును పంపే విషయంలో పిసిబి మల్లగుల్లాలు పడుతున్నది. గతంలో చేసిన హెచ్చరికను దృష్టిలో ఉంచుకొని, టి-20 వరల్డ్ కప్ నుంచి వైదొలగడమా లేక ఐసిసి నిబంధనలను అనుసరించి పాల్గొనడమా అన్నది తేల్చుకోవాల్సి ఉంది.
భారత్‌లో పాకిస్తాన్ జట్టు భద్రతకు ఎలాంటి సమస్యలు ఉండవని, నిర్భయంగా టోర్నీలకు హాజరుకావచ్చని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం చేసిన ప్రకటనపై పిసిబి మీడియా డైరెక్టర్ అంజద్ హుస్సేన్ స్పందించాడు. గురువారం అతను పిటిఐతో మాట్లాడుతూ వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాడు. అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నాడు. నిజానికి భారత్ వైఖరి ఏమిటో తెలియక, అర్థంగాక పిసిబి చివరి క్షణం వరకూ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంది. ఈనెల జరగాల్సిన సిరీస్‌లో భారత్ ఆడకపోతే, తాము కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఒకానొక సమయంలో బిసిసిఐని పిసిబి హెచ్చరించింది. కానీ, దాని వల్ల ఎలాంటి ఫలితం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ధోరణిని మార్చుకుంది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టి-20 ప్రపంచ కప్ నుంచి వైదొలగుతామని పిసిబి చేసిన హెచ్చరిక బిసిసిఐలో కొంతలో కొంత చలనానికి కారణమైందిగానీ, ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాలోతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత ఏడాది కుదిరిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌తో భారత క్రికెట్ జట్టు డిసెంబర్‌లో సిరీస్ ఆడాల్సి ఉందని పిసిబి పదేపదే గుర్తుచేసినా బిసిసిఐ చివరి వరకూ నాన్చివేత ధోరణిని అనుసరించింది.
ద్వితీయ శ్రేణి విండీస్ జట్టు!
టి-20 వరల్డ్ కప్ పోటీలకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పూర్తి స్థాయి జట్టును బరిలోకి దించే అవకాశాలు కనిపించడం లేదు. దీనితో ద్వితీయ శ్రేణి జట్టును పంపడం ఖాయంగా కనిపిస్తున్నది. తాజా కాంట్రాక్టులోని కొన్ని అంశాలపై విభేదిస్తున్న చాలామంది సీనియర్ క్రికెటర్లు ఇంకా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయలేదు. ఈనెల 14వ తేదీలోగా సంతకం చేయాలని, లేకపోతే, కాంట్రాక్టును రద్దు చేస్తామని అధికారులు చేసిన హెచ్చరికలను సీనియర్లు ఎంత వరకూ ఖాతరు చేస్తారన్నది చూడాలి. ఒకవేళ కాంట్రాక్టు ప్రక్రియ ఈనెల రెండో వారాంతానికి పూర్తికాకపోతే, ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను పంపడం మినహా విండీస్‌కు మరో మార్గం లేదు.

అండర్-19 ప్రపంచ కప్
ఫైనల్‌కు వెస్టిండీస్
మీర్పూర్, ఫిబ్రవరి 11: అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో వెస్టిండీస్ జట్టు ఫైనల్ చేరింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ను ఈ జట్టు మూడు వికెట్ల తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. మెహిదీ హసన్ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మహమ్మద్ సైఫుద్దీన్ 36 పరుగులు సాధించాడు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 20 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. షమర్ స్ప్రింగర్, కెమర్ హోల్డర్ చెరి రెండు వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 48.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. బౌలింగ్‌లో రాణించి రెండు వికెట్లు సాధించిన షమర్ స్ప్రింగర్ బ్యాటింగ్‌లోనూ అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. షిమ్రోన్ హెట్మెయర్ 60 పరుగులు చేసి విండీస్ విజయంలో తన వంతు పాత్రను పోషించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో సలే మహమ్మద్ 37 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. మహమ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. ఫైనల్‌లో భారత్‌తో విండీస్ తలపడుతుంది.