క్రీడాభూమి

మెక్‌కలమ్ ‘ఆఖరి పోరాటం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ తన కెరీర్‌లో ఆఖరి పోరాటానికి సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తర్వాత అతను కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఇక్కడి బేసిన్ రిజర్వ్ మైదానంలో మొదలయ్యే మొదటి టెస్టు మెక్‌కలమ్‌కు కెరీర్‌లో వందోది. ఈ సిరీస్‌ను సాధించి, కెరీర్‌ను విజయంతో ముగించాలని మెక్‌కలమ్ పట్టుదలగా ఉన్నాడు. సహచరులు కూడా విజయంతోనే అతనికి వీడ్కోలు చెప్పేందుకు సర్వశక్తులు కేంద్రీకరించనున్నారు. ఆస్ట్రేలియాతో 26 సంవత్సరాల క్రితం న్యూజిలాండ్ ఒకే ఒక టెస్టు ఆడింది. బేసిన్ రిజర్వ్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌ను గెల్చుకుంది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఆసీస్‌పై న్యూజిలాండ్‌కు సిరీస్ దక్కలేదు. సుదీర్ఘ కాలంగా అందకుండా ఊరిస్తున్న సిరీస్ విజయాన్ని దక్కించుకోవలన్న కోరిక న్యూజిలాండ్ ఆటగాళ్లలో బలంగా ఉంది. ఇదే విషయాన్ని మెక్‌కలమ్ గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తావించాడు. బేసిన్ రిజర్వ్ తనకు ఎంతో ఇష్టమైన మైదానమని అంటూ, రెండేళ్ల క్రితం భారత్‌తో ఇదే మైదానంలో జరిగిన టెస్టులో తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 302 పరుగులు సాధించిన విషయాన్ని గుర్తుచేశాడు. స్వదేశంలో చివరి టెస్టు సిరీస్ ఆడడం, అంతర్జాతీయ క్రికెట్‌కు ఇక్కడే గుడ్‌బై చెప్పే అవకాశం రావడం తన అదృష్టమని అన్నాడు. ఇలావుంటే, ఈ మ్యాచ్‌లో ఒక్క సిక్స్ కొట్టినా టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా మెక్‌కలమ్ రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటి వరకూ కెరీర్‌లో 100 సిక్సర్లు సాధించిన అతను ఆడం గిల్‌క్రిస్ట్‌తో కలిసి రికార్డును పంచుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి మొదలయ్యే టెస్టులో అతను ఈ రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది.
బర్డ్‌కు పిలుపు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టులో ఫాస్ట్ బౌలర్ జాక్సన్ బర్డ్‌కు స్థానం దక్కింది. 2013 యాషెస్ సిరీస్‌లో చివరి టెస్టు ఆడిన అతను అప్పటి నుంచి జాతీయ జట్టులో మళ్లీ స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. మిచెల్ జాన్సన్, స్టార్క్, హాజెల్‌వుడ్ వంటి మేటి పేసర్లతో పోటీపడి అతను ఆస్ట్రేలియా జట్టుకు ఎంపిక కాలేకపోయాడు. అయితే, జాన్సన్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పడం, స్టార్క్‌సహా పలువురు పేసర్లు గాయాల సమస్యతో బాధపడడం వల్ల బర్డ్‌కు అవకాశం దక్కింది.