క్రీడాభూమి

ఆ ఫార్ములాను మార్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లండన్‌లో ఈ ఏడాది జూన్‌లో జరిగే ఐసిసి వార్షక సర్వసన్య సమావేశం దాకా ఇప్పుడు కొనసాగుతున్న ‘బిగ్ త్రీ’ రెవిన్యూ విధానానే్న కొనసాగించాలని ఐసిసి బోర్డును కోరాలంటూ బిసిసిఐ విభాగాలన్నీ మంగళవారం ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాయి. అలాగే ఐసిసి బోర్డు సమావేశం తర్వాతనే చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భారత్ పాల్గొనడంపై ఏదయినా నిర్ణయం తీసుకోవాలని కూడా మంగళవారం ఇక్కడ జరిగిన బిసిసిఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. అయితే ఎలాంటి తీవ్ర వైఖరీ తీసుకోవద్దని సమావేశంలో పాల్గొన్న సభ్యుల్లో ఎక్కువ మంది అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 27, 28 తేదీల్లో దుబాయిలో జరిగే ఐసిసి బోర్డు సమావేశంలో బిసిసిఐ అభిప్రాయాలను బోర్డు ప్రతినిధి, బిసిసిఐ జాయింట్ సెక్రటరీ తెలియజేస్తారని తెలుస్తోంది. ‘రెవిన్యూలో అధిక భాగాన్ని క్రికెట్ ఆడే ప్రధాన దేశాలయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్‌లు పంచుకునే ఇప్పుడున్న విధానానే్న కొనసాగించాలని ఐసిసిని కోరాలని ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించాం. లండన్‌లో జరిగే ఐసిసి వార్షిక సమావేశంలో మేము తప్పకుండా ఒక కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తాం. సమావేశంలో ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఈ మేరకు ఆమోదించాం’ అని సమావేవానికి హాజరయిన బిసిసిఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా,్భరత దేశ ప్రయోజనాలను కాపాడడమే తన ప్రధాన లక్ష్యమని చౌదరి చెప్పారు. సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ల కమిటీ ఒక ఫార్ములాను ఇచ్చిందని, అది భారత్‌కు లాభం చేకూర్చేదిగా ఉందని చౌదరి చెప్తూ, దానిలోని ముఖ్యాంశాలను కూడా తాము తీసుకుంటామని చెప్పారు. కాగా, చాంపియన్స్ ట్రోఫీనుంచి వైదొలిగే విషయం కూడా పరిశీలనలో ఉందా అని అడగ్గా, కవులు, తత్వవేత్తలు మాత్రమే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరని చౌదరి అన్నారు. అయితే చౌదరి దుబాయినుంచి తిరిగి వచ్చి ఐసిసి వైఖరిని బిసిసిఐకి తెలియజేస్తారని, ఒక వేళ దాని వైఖరిలో ఎలాంటి మార్పూ లేని పక్షంలో 2014లో సంతకం చేసిన పాత ఒప్పందంపై పునః పరిశీలన జరుపుతారని తీర్మానాన్ని బట్టి అర్థమవుతోంది.
టీమిండియాకు ప్రోత్సాహకం రెట్టింపు
ఇదిలా ఉండగా ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై 2-1 టెస్టుల తేడాతో సిరీస్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని 50 లక్షలనుంచి కోటిరూపాయలకు రెట్టింపు చేయాలని బిసిసిఐ సమావేశంలో నిర్ణయించారు.