క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టులో నలుగురు పేసర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఏప్రిల్ 20: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) గురువారం ప్రకటించింది. ఈ జట్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, మిచెల్ స్టార్క్, జేమ్స్ పాటిన్సన్, జొష్ హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్ స్థానం సంపాదించారు. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి 18 వరకు జరిగే చాంపియన్స్ టోర్నీకి ఎంపికైన 15 మంది సభ్యుల బృందంలో హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్ కూడా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆడుతూ భుజం గాయం కారణంగా వైదొలగిన లిన్ పూర్తిగా ఫిట్నెస్‌తో ఉంటాడని సెలక్టర్లు ధీమా వ్యక్తం చేశారు. కాగా ఆల్‌రౌండర్లు మార్కొస్ స్టొయినిస్, మోజెస్ హెన్రిక్స్, జాన్ హాస్టింగ్స్, లెగ్ స్పిన్నర్ ఆడం జంపా జట్టులో ఉన్నారు. స్టీవెన్ స్మిత్‌కే మరోసారి కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పారు. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీపడుతుంది.
ఆసీస్ జట్టు వివరాలు: స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్, జాన్ హాస్టింగ్స్, జొష్ హాజెల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మోజెస్ హెన్రిక్స్, క్రిస్ లిన్, గ్లేన్ మాక్స్‌వెల్, జేమ్స్ పాటిన్సన్, మిచెల్ స్టార్క్, మార్కొస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, ఆడం జంపా.
బంగ్లా జట్టులో షఫియుల్
ఢాకా: చాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ సెలక్టర్లు ప్రకటించిన జట్టులో ఫాస్ట్ బౌలర్ షఫీయుల్ ఇస్లాం చోటు దక్కించుకున్నాడు. గాయం కారణంగా కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న అతను ఇప్పుడు కోలుకున్నాడని సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టుకు మష్రాఫ్ మొర్తాజా నాయకత్వం వహిస్తాడు.
బంగ్లాదేశ్ జట్టు: మష్రాఫ్ మొర్తాజా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, ఇమ్రుల్ ఖయాస్, సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం, మహమ్మదుల్లా రియాద్, సబ్బీర్ రహ్మాన్, మొసాడెక్ హొస్సేన్, సంజముల్ ఇస్లాం, ముస్త్ఫాజుర్ రహ్మాన్, తస్కిర్ అహ్మద్, రూబెల్ హొస్సేన్, మెహదీ సహన్ మీర్జా, షఫీయుల్ ఇస్లాం.