క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్‌కు షరపోవా అర్హతపై మే 15న నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, ఏప్రిల్ 20: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా బ్యూటీ మరియా షరపోవా ఆడే విషయంపై నెలకొన్న సస్పెన్స్‌కు వచ్చేనెల 15వ తేదీన తెరపడనుంది. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించి, డోప్ పరీక్షలో పట్టుబడిన షరపోవాపై సస్పెన్షన్ వేటు పడింది. శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆమె తిరిగి అంతర్జాతీయ కెరీర్‌ను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. అయితే, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన 30 ఏళ్ల షరపోవాను అంతర్జాతీయ పోటీలకు అనుమతించవద్దన్న డిమాండ్ పెరగడంతో, మిగతా టోర్నీల మాదిరిగానే ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పైగా, నిషేధం కారణంగా ఆమెకు ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు లభించలేదు. దీనితో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేందుకు షరపోవా అర్హురాలా కాదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో, వచ్చేనెల 15వ తేదీన తుది నిర్ణయం తీసుకుంటామని నిర్వాహకులు ప్రకటించారు.