క్రీడాభూమి

ఐదు నుంచి మూడుకు.. మెరుగుపడిన సింధు ర్యాంకింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరింది. ఐదు నుంచి ఆమె రెండు స్థానాలను మెరుగుపరచుకొని, మూడో స్థానాన్ని అందుకోగా, మరో హైదరాబాదీ, మాజీ ప్రపంచ నంబర్ వన్ సైనా నెహ్వాల్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. కాగా, పురుషుల విభాగంలో లీ చాంగ్ వెయ్, విక్టర్ అక్సెల్సెన్, జాన్ ఒ జొర్గెనె్సన్ వరుసగా మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు.
మహిళల్లో ‘టాప్-10’: 1. తాయ్ జూ ఇంగ్ (చైనీస్ తైపీ/ 93,721 పాయింట్లు), 2. కరోలినా మారిన్ (స్పెయిన్/ 80,714 పాయింట్లు), 3. పివి సింధు (్భరత్/ 74,749 పాయింట్లు), 4. సంగ్ జీ హ్యున్ (దక్షిణ కొరియా/ 74,726 పాయింట్లు), 5. అకానే యమాగూచీ (జపాన్/ 73,979 పాయింట్లు), 6. సన్ యూ (చైనా/ 69,220 పాయింట్లు), 7. హీ బింగ్‌జియావో (చైనా/ 61,722 పాయింట్లు), 8. సైనా నెహ్వాల్ (్భరత్/ 59,575 పాయింట్లు), 9. నజోమీ ఒకహరా (జపాన్/ 57,287 పాయింట్లు), 10. రచానొక్ ఇంతనాన్ (్థయిలాండ్/ 55,714 పాయింట్లు).
పురుషుల్లో ‘టాప్-10’: 1. లీ చాంగ్ వెయ్ (మలేసియా/ 81,703 పాయింట్లు), 2. విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్/ 71,814 పాయింట్లు), 3. జాన్ ఒ జొర్గెనె్సన్ (డెన్మార్క్/ 69,994 పాయింట్లు), 4. శాన్ వాన్ హో (దక్షిణ కొరియా/ 68,837 పాయింట్లు), 5. చెన్ లాంగ్ (చైనా/ 65,004 పాయింట్లు), 6. షీ యూకీ (చైనా/ 64,407 పాయింట్లు), 7. చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ/ 62,987 పాయింట్లు), 8. లిన్ డాన్ (చైనా/ 62,558 పాయింట్లు), 9. తియాన్ హౌవెయ్ (చైనా/ 58,790 పాయింట్లు), 10. ఇంగ్ కా లాంగ్ ఆగ్నస్ (హాంకాంగ్/ 56,777 పాయింట్లు).