క్రీడాభూమి

వోక్స్, ఖాజా శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు సంపాదించింది. ఆడం వోగ్స్, ఉస్మాన్ ఖాజా శతకాలు ఆ జట్టును పటిష్టమైన స్థితికి చేర్చాయి. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 183 పరుగులకు ఆలౌట్‌కాగా, ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు చేజార్చుకొని 147 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఉదయం ఆటను కొనసాగించి, 299 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను ఉస్మాన్ ఖాజా రూపంలో కోల్పోయింది. అతను 216 బంతులు ఎదుర్కొని, 25 ఫోర్లతో 140 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. అదే ఓవర్‌లో మిచెల్ మార్ష్ (0)ను కూడా రిటర్న్ క్యాచ్ అందుకొని బౌల్ట్ పెవిలియన్‌కు పంపాడు. పీటర్ నెవిల్ 32 పరుగులు చేసి, ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ వాల్టింగ్‌కు దొరికాడు. ఉస్మాన్ ఖాజాతో కలిసి నాలుగో వికెట్‌కు 168, నెవిల్‌తో ఆరో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాలను అందించిన వోగ్స్ మొత్తం 286 బంతులు ఎదుర్కొని, 26 ఫఓర్లతో 176 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లకు 463 పరుగులు సాధించి, న్యూజిలాండ్‌పై ఇప్పటి వరకూ 280 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేయగా, వోగ్స్‌తోపాటు పీటర్ సిడిల్ (29) నాటౌట్‌గా ఉన్నాడు.

రాంచీ చేతిలో
యుపి చిత్తు
హాకీ ఇండియా లీగ్
రాంచీ, ఫిబ్రవరి 13: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో శనివారం రాంచీ రైనోస్ చేతిలో ఉత్తర ప్రదేశ్ (యుపి) విజార్డ్స్ జట్టు చిత్తయంది. ఏక పక్షంగా దాడులకు ఉపక్రమించిన రాంచీ చివరి వరకూ ఆధిపత్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ ఆరంభంలో ఆత్మరక్షణపై ధ్యాస ఉంచిన ఈ జట్టు ఆతర్వాత చెలరేగింది. 40వ నిమిషంలో ఫ్లిన్ ఒగిలివ్ ఫీల్డ్ గోల్ చేయడంతో రాంచీకి రెండు గోల్స్ లభించాయ. అనంతరం, 47వ నిమిషంలో ఆష్లే జాక్సన్, 59వ నిమిషంలో సుమీత్ కుమార్ గోల్స్ సాధించారు. వీరిద్దరు కూడా ఫీల్డ్ గోల్స్ చేయడంతో రాంచీ 6-0 తేడాతో యుపిపై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.