క్రీడాభూమి

బెంగళూరు ఫ్లాప్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 23: ఐపిఎల్‌లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 131 పరుగులకే కుప్పకూలింది.. కానీ, సులభంగా గెలిచే అవకాశాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సద్వినియోగం చేసుకోలేకపోయంది. 9.4 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటై, చావుదెబ్బ తిన్నది. ఐపిఎల్ చరిత్రలోనే అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా అవమానకర మైన రికార్డు సృష్టించింది. నిరుటి రన్నరప్ ఈ విధంగా చేతులెత్తేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, హార్డ్ హిట్టర్ ఎబి డివిలియర్స్ వంటి హేమా హేమీలంతా పరుగుల వేటలో విఫలం కావడంతో బెంగళూరు అత్యంత అవమానకరమైన రీతిలో, యాభై పరుగుల మైలురాయని కూడా చేరకుండా అవుటైంది. నైట్ రైడర్స్ ఇంకా 62 బంతులు మిగిలి ఉండగానే 82 పరుగుల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచిన బెంగళూరు ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు సునీల్ నారైన్, గౌతం గంభీర్ చక్కటి ఆరంభాన్నిచ్చే దిశగా స్కోరుబోర్డును కదిలించారు. కానీ, 48 పరుగుల స్కోరవద్ద గంభీర్ (14) అవుట్ కావడంతో నైట్ రైడర్స్ పతనం ఆరంభమైంది.17 బంతుల్లో 34 పరుగు లు చేసిన నారైన్ రెండో వికెట్‌గా వెనుదిరగడంతో నైట్ రైడర్స్ కష్టాలు మరింతగా పెరిగాయ. జట్టును ఆదుకునే సత్తా ఉన్న రాబిన్ ఉతప్ప (11), మనీష్ పాండే (15), యూసుఫ్ పఠాన్ (8), సూర్యకుమార్ యాదవ్ (15) పెవిలియన్‌కు క్యూకట్టడంతో నైట్ రైడర్స్ చేతులెత్తేసింది. 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడ లేక, 19.3 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. యుజువేంద్ర చాహల్ 16 పరుగులకే మూడు వికెట్లు కూల్చాడు. టైమల్ మిల్స్, పవన్ నేగీ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
సాదాసీదా లక్ష్యమైన 132 పరుగులను సాధించడానికి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన గుజరాత్ మొదటి ఓవర్ మూడో బంతికే విరాట్ కోహ్లీ (0) వికెట్ కోల్పోయంది. మన్దీప్ సింగ్ ఒక పరుగు చేసి పెవిలియన్ చేరితే, పరుగుల యంత్రం ఎబి డివిలియర్స్ ఆరు బంతుల్లో 8 చొప్పున పరుగులు చేసి వెనుదిరిగారు. కేవలం 12 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయన బెంగళూరు కష్టాల్లో పడింది. థర్డ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కేదార్ జాదవ్ వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నంలో తడబడి, 9 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుటయ్యాడు. తన సహజమైన బ్యాటింగ్ విధానానికి భిన్నంగా ఆడి, 17 బంతులు ఆడి ఏడు పరుగులు చేసిన గేల్‌ను కౌల్టర్ నైల్ క్యాచ్ అందుకోగా క్రిస్ వోగ్స్ అవుట్ చేశాడు. అదే ఓవర్‌లో అతను స్టువర్ట్ బిన్నీ (8) వికెట్‌ను కూడా సాధించాడు. బెంగళూరు ఏడు ఓవర్లలో 40 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుంది. పవన్ నేగీ (2)ని కొలిన్ డిగ్రాండ్‌హోమ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. శామ్యూల్ బ్రదీ పరుగుల ఖాతా తెరవకుండానే క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. 48 పరుగులకు బెంగళూరు ఎనిమిది వికెట్లు కోల్పోయంది. తన తర్వాతి ఓవర్‌లో టైమల్ మిల్స్ (2) వికెట్‌ను కొలిన్ డిగ్రాండ్‌హోమ్ సాధించాడు. అదే ఓవర్‌లో యుజువేంద్ర చాహల్ (0) కూడా అవుట్ కావడంతో బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటైంది. కొలిన్ డిగ్రాండ్‌హోమ్ 1.4 ఓవర్లు బౌల్ చేసి, కేవలం నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. క్రిస్ వోక్స్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను ఆరు పరుగులకే మూడు వికెట్లు కూల్చాడు. నాథన్ కౌల్టర్ నైల్‌కు కూడా మూడు వికెట్లు లభించాయ. అయతే అతను 21 పరుగులిచ్చాడు.

అత్యల్ప స్కోర్లు
ఐపిఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ పేరిట ఉన్న రికార్డును రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తిరగరాసింది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 49 పరుగులకే ఆలౌటైంది. ఇదే జట్టుపై రాజస్థాన్ 2009లో 58 పరుగులు చేసింది. ఈ జాబితాలో మూడో స్థానం కోల్‌కతా నైట్ రైడర్స్‌ది కావడం గమనార్హం. 2008లో ముంబయ ఇండియన్స్‌పై ఆ జట్టు 67 పరుగులకు కుప్పకూలింది. అత్యల్ప స్కోర్ల జాబితాలోని మొదటి మూడు స్థానాల్లో నైట్ రైడర్స్, బెంగళూరు ఏదో ఒక కారణంగా చోటు దక్కించుకోవడం గమనార్హం. బెంగళూరు ఒక లో స్కోరింగ్ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుగా ఉంటే, ఈసారి ఆ జట్టుకే అవమానకరమైన స్కోరు తప్పలేదు. నైట్ రైడర్స్ ఈసారి ప్రత్యర్థి జట్టు పాత్రలో ఉంటే, ఒకసారి ఇదే జట్టు తక్కువ పరుగులు చేసిన జట్టుగా జాబితాలో నిలిచింది.