క్రీడాభూమి

మెరిసిన ఆమ్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఏప్రిల్ 23: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 26 పరుగుల తేడాతో గుజరాత్ లయన్స్‌ను ఓడించింది. పంజాబ్ ఓపెనర్ హషీం ఆమ్లా మరోసారి స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడితే, జట్టును గెలిపించేందుకు గుజరాత్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ పడిన శ్రమ వృథా అయింది. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన గుజరాత్ 162 పరుగులకు పరిమితమైంది. టాస్ గెలిచిన ఈ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 188 పరుగులు సాధించింది. కేవలం 11 పరుగులకే మొదటి వికెట్‌ను మానన్ వోహ్రా (2) రూపంలో కోల్పోగా, రెండో వికెట్‌కు ఆమ్లాతో కలిసి 70 పరుగులు జత కలిపిన తర్వాత షాన్ మార్ష్ అవుటయ్యాడు. అతను 24 బంతులు ఎదుర్కొని, 30 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, జట్టు స్కోరు 128 పరుగుల వద్ద ఆమ్లా వికెట్ కూలింది. అతను 40 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు సాధించి, శుభం అగర్వాల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ గ్లేన్ మాక్స్‌వెల్ 31 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బికాగా, మార్కస్ స్టొయినిస్ కేవలం ఏడు పరుగులకే అవుటయ్యాడు. రన్‌రేట్‌ను పెంచడంపైనే దృష్టి కేంద్రీకరించిన అక్షర్ పటేల్ 17 బంతుల్లో 34 పరుగులు చేసి, డ్వెయిన్ స్మిత్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి వృద్ధిమాన్ సాహా (10) రనౌటయ్యాడు. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి పంజాబ్ 188 పరుగులు సాధించగా, మోహిత్ శర్మ నాలుగు పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. గుజరాత్ సంచలన బౌలర్ ఆండ్రూ టై 35 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. శుభమ్ అగర్వాల్, నాథూ సింగ్, రవీంద్ర జడేజా, డ్వెయిన్ స్మిత్ తలా ఒక వికెట్ కూల్చారు.
తొలి ఓవర్‌లోనే వికెట్
పంజాబ్‌ను ఓడించేందుకు 189 పరుగులు సాధించాల్సిన గుజరాత్ మొదటి ఓవర్‌లోనే బ్రెండన్ మెక్‌కలమ్ వికెట్‌ను కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన అతను సందీప్ శర్మ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ 12 బంతులు ఎదుర్కొని, 13 పరుగులు చేశాడు. మార్కొస్ స్టొయినిస్ క్యాచ్ అందుకోగా మోహిత్ శర్మ అతనిని పెవిలియన్ పంచాడు. ఆతర్వాత, దినేష్ కార్తీక్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతున్నప్పటికీ, మిగతా వారు పరుగుల వేటను కొనసాగించడంలో విఫలమయ్యారు. జట్టును ఆదుకుంటారనుకున్న రవీంద్ర జడేజా (9), డ్వెయిన్ స్మిత్ (4), ఆకాశ్‌దీప్ నాథ్ (0) సింగిల్ డిజిట్స్‌కే పరిమితయ్యారు. ఆండ్రూ టై 12 బంతుల్లోనే 22 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో అవుట్‌కాగా, చివరిలో బాసిల్ థంపి (11)తో కలిసి నాటౌట్‌గా నిలిచిన దినేష్ కార్తీక్ 44 బంతుల్లో, ఆరు ఫోర్లతో 58 పరుగులు చేసి క్రీజ్‌లో నిలిచాడు. మొత్తం మీద గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేయగలిగింది. సందీప్ శర్మ, కరియప్ప, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు కూల్చారు. ఇలావుంటే, ఏడు మ్యాచ్‌ల్లో పంజాబ్ జట్టుకు ఇది మూడో విజ యంకాగా, గుజరాత్‌కు ఐదో పరాజయం.
సంక్షిప్త స్కోర్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 (హషీం ఆమ్లా 65, షాన్ మార్ష్ 30, గ్లేన్ మాక్స్‌వెల్ 31, అక్షర్ పటేల్ 34, ఆండ్రూ టై 2/35).
గుజరాత్ లయన్స్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 (సురేష్ రైనా 32, దినేష్ కార్తీక్ 58 నాటౌట్, ఆండ్రూ టై 22, సందీప్ శర్మ 2/40, కరియప్ప 2/24, అక్షర్ పటేల్ 2/36).
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:
హషీం ఆమ్లా
(కింగ్స్ ఎలెవెన్ పంజాబ్).

అందరూ సింగిల్ డిజిట్సే!
* రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకయారు. అంతా సింగిల్ డిజిట్స్‌కే పరిమితం కావడం ఐపిఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. కేదార్ జాదవ్ 9 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, ఆ జట్టు ఫ్లాప్ షో ఏ విధంగా కొనసాగిందో ఊహించడం కష్టంకాదు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ 131 పరుగులకే కుప్పకూలడంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరు విజయం నల్లేరుపై నడకగానే కనిపించింది. కానీ, ఆ జట్టు బ్యాటింగ్ అందుకు భిన్నంగా కొనసాగింది. మొదటి ఓవర్‌తో మొదలైన వికెట్ల పతనం చివరి వరకూ కొనసాగింది. ఏ ఒక్కరూ డబుల్ డిజిట్స్‌కు చేరుకోలేనంతగా వైఫల్యాలు కొనసాగాయ. చివరికి ఎక్‌స్ట్రాలు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం.

ఐపిఎల్‌లో నేడు

ముంబయి ఇండియన్స్ వర్సెస్
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్
ముంబయి వాంఖడే స్టేడియంలో
సోమవారం రాత్రి 8 గంటలకు మొదలు

(ఇప్పటి వరకూ ముంబయి ఇండియన్స్ ఏడు మ్యాచ్‌లు ఆడి, ఆరింటిని గెల్చుకొని, మొత్తం 12 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడు పరాజయాలను ఎదుర్కొంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో ముంబయి హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతుండగా, పుణే గట్టిపోటీనిచ్చే అవకాశాలున్నాయని పరిశీలకుల అంచనా).