క్రీడాభూమి

పుట్టబోయే బిడ్డకు సెరెనా సందేశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, ఏప్రిల్ 24: మళ్లీ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను సంపాదించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తనకు పుట్టబోయే బిడ్డకు ఇప్పుడే ఒక సందేశాన్ని పంపింది. ‘నీ రాకకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. వచ్చే ఏడాది బాక్స్‌లో కూర్చొని నా ఆటను చూసే తరుణం కోసం వేచి ఉన్నాను. నవ్వు వస్తున్నావని తెలిసిన మరుక్షణమే ఎంతో పొంగిపోయాను. నీ వల్లే నాకు ప్రశాంతత అంటే ఏమిటో తెలిసింది. నువ్వే నా బలం’ అని ఇన్‌స్టా గ్రామ్‌లో పేర్కొంది. తన బాయ్‌ఫ్రెండ్ అలెక్సిస్ ఒహానియన్ జన్మదినం రోజే సెరెనాకు మళ్లీ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లభించడం విశేషం. ఒహానియన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సెరెనా, తమకు పుట్టబోయే బిడ్డకు కూడా ఉద్విగ్నపూరిత సందేశాన్ని ఉంచింది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో సెరెనా తల్లికాబోతున్నదని ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఫొటో, దాని కింద సందేశం స్పష్టం చేశాయ. అయతే, కొన్ని గంటల్లోనే ఆమె ఫొటోను తీసేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సెరెనా తల్లికాబోతున్నదన్న వార్తలో నిజం ఉందా లేదా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోయంది. అయతే, తాజా పోస్టింగ్‌తో సెరెనా తాను గర్భవతినని పరోక్షంగా ధ్రువీకరించింది. వచ్చే ఏడాది స్టాండ్స్‌లో కూర్చొని ఆటను తిలకించే రోజు కోసం ఎదురు చూస్తున్నానని చెప్పడం ద్వారా, ప్రసవం తర్వాత ఆమె మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తుందనే విషయాన్ని తేల్చి చెప్పింది. మొత్తం మీద పుట్టబోయే బిడ్డకు సెరెనా పంపిన సందేశం ఇప్పుడు టెన్నిస్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె గర్భవతేనన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నది.