క్రీడాభూమి

స్టట్‌గార్ట్ టోర్నీకి షరపోవా రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టట్‌గార్ట్, ఏప్రిల్ 24: డోపింగ్ కేసులో 15 నెలల సస్పెన్షన్‌ను పూర్తి చేసుకున్న రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించనుంది. బుధవారం మొదలయ్యే స్టట్‌గార్ట్ టోర్నమెంట్‌లో ఆడేందుకు సిద్ధమైంది. తాను మెల్డోనియం వాటినట్టు విలేఖరుల సమావేశం పెట్టి మరీ షరపోవా ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే, అది నిషిద్ధ ద్రవ్యాల జాబితాలో ఉందనే విషయం తనకు తెలియదని, గుండె సంబంధమైన వ్యాధుల నివారణకు మాత్రమే తాను దానిని ఉపయోగించానని 30 ఏళ్ల షరపోవా వివరణ ఇచ్చుకుంది. అయితే, చాలా మంది క్రీడాకారిణులు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించకుండా ఆమెను టెన్నిస్ నుంచి శాశ్వతంగా నిషేధించాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. ఇలావుంటే, పలువురు టెన్నిస్ స్టార్ల అభిప్రాయాలను పట్టించుకోకుండా స్టట్‌గార్ట్ టోర్నమెంట్ అధికారులు ఆమెకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీని అందించారు. ఒకవేళ మొదటి రౌండ్‌ను షరపోవా సమర్థంగా అధిగమిస్తే రెండో రౌండ్‌లో పోలాండ్‌కు చెందిన అగ్నీస్కా రద్వాన్‌స్కాను ఢీకొనాల్సి ఉంటుంది. షరపోవా పునరాగమనాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో రద్వాన్‌స్కా కూడా ఉండడం విశేషం. అయితే, విమర్శలను తాను పట్టించుకోనని షరపోవా స్పష్టం చేసింది. తన దృష్టి టోర్నమెంట్‌పైనే కేంద్రీకృతమైందని, మిగతా అంశాలను గురించి ఆలోచించడం లేదని పేర్కొంది.