క్రీడాభూమి

ట్రయథ్లాన్‌లో డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ ముందుకు దూసుకెళుతున్నది. ట్రయథ్లాన్ పురుషులు, మహిళల విభాగాల్లో స్వర్ణాలను కైవసం చేసుకొని, తనకు తిరుగులేదని చాటింది. శనివారం పోటీలు ముగిసే సమయానికి మొత్తం 268 పతకాలను కైవసం చేసుకొని అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. వీటిలో 156 స్వర్ణం, 85 రజతం, 27 కాంస్యాలున్నాయి. శ్రీలంక 25 స్వర్ణం, 55 రజతం, 81 రజతం (మొత్తం 161) పతకాలతో ద్వితీయ స్థానంలో ఉంది. 79 పతకాలతో పాకిస్తాన్ మూడో స్థానంలో నిలిచింది. షూటింగ్‌లో భారత్ గురితప్పకుండా పతకాలు కొల్లగొట్టింది. పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విండివిజువల్ ఈవెంట్‌లో ఓంకార్ సింగ్, మహిళల 25 మీటర్ల పిస్టల్ ఇండివిజువల్ ఈవెంట్‌లో రాహి సర్నోబత్, మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పోజిషన్స్‌లో అంజుమ్ వౌద్గిల్ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన షూటింగ్ పోటీల్లో పాకిస్తాన్‌కు చెందిన కలీముల్లా తప్ప పతకాలు సాధించిన వారంతా భారతీయులే కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఈవెంట్‌లో ఓంకార్ సింగ్ స్వర్ణ పతకాన్ని అందుకోగా, కలీముల్లాకు రజత పతకాన్ని స్వీకరించాడు. జితేంద్ర విభూతేకు కాంస్య పతకం లభించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో రాహి సర్నోబత్ విజేతగా నిలిచింది. అన్నూరాజ్ సింగ్, అనీసా సయ్యద్ వరుసగా రజత, కాంస్య పతకాలను గెల్చుకున్నారు.
మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్‌లో రాహి సర్నోబత్, అనీసా సయ్యద్, అన్నూరాజ్ సింగ్ సభ్యులుగా ఉన్న భారత జట్టు స్వర్ణ పతకాన్ని అందుకుంది. శ్రీలంకకు రజత పతకం లభించగా, పాకిస్తాన్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ట్రయథ్లాన్ పురుషుల విభాగంలో మొదటి రెండు స్థానాలు భారత్‌కే దక్కడం విశేషం. దిలీప్ కుమార్ రెండు గంటల, 3.53 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అతనికి గట్టిపోటీనిచ్చిన గురుదత్ రెండు గంటల, 5.31 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. శ్రీలంకకు చెందిన నువాన్ కుమార రెండు గంటల, 10.36 నిమిషాలతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
మహిళల ట్రయథ్లాన్‌లోనూ మొదటి రెండు స్థానాలు భారత్‌కే లభించాయి. పల్లవీ రేతివాల స్వర్ణ పతకాన్ని అందుకోగా, పూజా చౌరుషీకి రజత పతకం లభించింది. నేపాల్‌కు చెందిన రోజా కాంస్య పతకాన్ని గెల్చుకుంది.