క్రీడాభూమి

నేమార్ ఆస్తులు ఫ్రీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావో పౌలో: బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ నేమార్ ఆస్తులను అధికారులు స్తంభింప చేశారు. వీటి మొత్తం 50 మిలియన్ డాలర్లు (సుమారు 342 కోట్ల రూపాయలు) వరకు ఉంటుంది. బ్రెజిల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేమార్ 2011-2013 మధ్యకాలంలో తప్పుడు లెక్కలు చూపి సుమారు 16 మిలియన్ డాలర్ల మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత అతను నేరానికి పాల్పడినట్టు స్పష్టమైందని ప్రకటించారు. అతనికి చెందిన వ్యక్తిగత జెట్ విమానం, ఒక పడవసహా పలు ఆస్తులను స్తంభింప చేస్తూ వారెంట్లు జారీ చేస్తున్నారు. బార్సిలోనా తరఫున ఆడుతూ ఎక్కువ కాలం స్పెయిన్‌లోనే ఉండే నేమార్ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీలు లేదా సెలవు రోజుల్లో బ్రెజిల్‌కు వచ్చేందుకు ఉపయోగించే ప్రత్యేక జెట్ విమానాన్ని కూడా అధికారులు ఫ్రీజ్ చేయడం గమనార్హం. బ్రెజిల్ ఫెడరల్ టాక్స్ ఏజెన్సీ ఆడిటర్ లాగరో జంగ్ మార్టిన్స్ చెప్పిన వివరాల ప్రకారం నేమార్ పన్ను ఎగవేతకు పాల్పడిన విషయం రుజువైంది. అతను బకాయిలను చెల్లిస్తే కేసుకు తెరపడుతుంది. ఒకవేళ ఆస్తుల జప్తుపై అతను అప్పీల్ చేసుకుంటే, కేసు మరింత జటిలమవుతుంది. సుమారు ఏడాది కాలంగా ఈకేసుపై విచారణ జరుగుతున్నా నేమార్ దీనిపై దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. నేమార్ తరఫున అతని తండ్రి సీనియర్ నేమార్ ఆర్థిక లావాదేవీలను చూసుకుంటున్నాడు. అతనే మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. తండ్రిపై మొత్తం బాధ్యతను ఉంచిన నేమార్ ఆటపైనే దృష్టి కేంద్రీకరించాడు. అయితే, సీనియర్ నేమార్ పన్ను ఎగవేతకు పాల్పడడం ఇప్పుడు నేమార్ మెడకు చుట్టుకుంది. సాంటోస్ నుంచి బార్సిలోనాకు వెళ్లినప్పుడు నేమార్ ఎంత మొత్తాన్ని కాంట్రాక్టు ఫీజుగా తీసుకున్నాడన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. బార్సిలోనాగానీ, నేమార్‌గానీ ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను బయటపెట్టలేదు. అయితే, 74 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరినట్టు బ్రెజిల్ ఆదాయ పన్ను అధికారులు అంటున్నారు. ఈ మొత్తంలో సాంటోస్‌కు అధికారికంగా 18.5 మిలియన్ డాలర్లు లభించాయని, మిగతా 55.5 మిలియన్ డాలర్లు నేమార్ తండ్రి పేరిట ఉన్న కంపెనీ ఖాతాలోకి వెళ్లాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. స్పెయిన్‌కు వెళ్లి విచారణ జరిపిన బ్రెజిల్ అధికారులు సాంటోస్ నుంచి నేమార్‌ను ట్రాన్స్‌ఫర్‌పై తీసుకోవడానికి బార్సిలోనా అక్షరాలా 90 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని ధ్రువీకరించారు. అయితే, వివరాలను గోప్యంగా ఉంచి, అతి తక్కువ మొత్తాన్ని రికార్డుల్లో చూపడం ద్వారా నేమార్ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. ఏడాది కాలంగా కేసు విచారణ జరుగుతున్నప్పటికీ నేమార్ నుంచిగానీ, అతని తండ్రి నుంచిగానీ సరైన స్పందన రాకపోవడంతో ఆస్తులను స్తంభింప చేసేపనిలో పడ్డారు. మొత్తం మీద వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ కోసం సిద్ధమవుతున్న నేమార్‌ను కొత్త సమస్య వేధించడం ఖాయంగా కనిపిస్తున్నది.