క్రీడాభూమి

భారత్ ‘ట్రిపుల్ సెంచరీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన భారత్ పతకాల హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. మొత్తం 308 పతకాలను కైవసం చేసుకొని తనకు తిరుగులేదని నిరూపించింది. వీటిలో 188 స్వర్ణం, 90 రజతం, 30 కాంస్య పతకాలు ఉన్నాయి. శ్రీలంక 25 స్వర్ణం, 63 రజతం, 98 కాంస్యాలతో మొత్తం 186 పతకాలు గెల్చుకున్న శ్రీలంకకు రెండో స్థానం దక్కింది. పాకిస్తాన్ 12 స్వర్ణం, 37 రజతం, 57 కాంస్యం (మొత్తం 106) పతకాలతోమూడో స్థానంతో పోటీలను ముగించింది. 2010లో జరిగిన శాగ్‌లో 90 స్వర్ణాలుసహా 175 పతకాలు సాధించిన భారత్ ఈసారి మూడు వందలకు పైగా పతకాలను అందుకోవడం విశేషం.
కోమ్ నాకౌట్ పంచ్
మహిళల బాక్సింగ్‌లో సోమవారం మూడు విభాగాల్లో పోటీలు జరగ్గా, మూడు స్వర్ణాలను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. భుజం గాయం నుంచి కోలుకున్న లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కోమ్ 51 కిలోల విభాగం ఫైనల్‌లో శ్రీలంక బాక్సర్ అనూష కొడితువక్కు దిర్లుక్షిని బలమైన పంచ్‌లతో చిత్తుచేసింది. ఈ ఫైట్ కేవలం 90 సెకన్లలోనే ముగియడం విశేషం. కోమ్ బలమైన పంచ్‌లతో విరుచుకుపడడంతో పట్టుతప్పిన అనూష కిందపడింది. ఆమె కుడి మోకాలికి గాయం కావడంతో టెక్నికల్ నాకౌట్ కింద కోమ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించాడు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి అనూషకు కనీసం రెండుమూడు నెలల సమయం పడుతుందని సమాచారం.
ఆసియా క్రీడల్లో న్యాయమూర్తుల నిర్ణయాన్ని వ్యతిరేకించి, పతకాన్ని తీసుకోవడానికి నిరాకరించిన కారణంగా ఏడాది సస్పెన్షన్‌కు గురైన సరితా దేవి మళ్లీ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని స్వర్ణాన్ని సాధించడం విశేషం. 60 కిలోల విభాగంలో ఆమె శ్రీలంకకు చెందిన విదూషిక ప్రబధిని ఓడించింది. సస్పెన్షన్ కాలాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఏడాది తర్వాత పోటీలకు దిగినప్పటికీ పూర్వ ప్రతిభనే కొనసాగించి అభిమానులను ఆకట్టుకుంది. కాగా, 75 కిలోల విభాగంలో పూజా రాణి శ్రీలంకకు చెందిన తన ప్రత్యర్థి నీలాంతి అందారవీర్‌ను ఒకే రౌండ్‌లో ఓడించి స్వర్ణ పతకాన్ని అందుకుంది.
జూడోలో రెండు స్వర్ణాలు
జూడోలో భారత్ రెండు స్వర్ణాలు, మరో రెండు రజత పతకాలను కైవసం చేసుకుంది. పురుషుల 90 కిలోల విభాగంలో అఫ్గానిస్తాన్‌కుచెందిన మహమ్మద్ ఇస్మాయిల్ కాకర్‌ను అవతార్ సింగ్ కేవలం 49 సెకన్లలోనే చిత్తుచేసి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అవతార్ టెక్నిక్ ముందు కాకర్ నిలవలేకపోయాడు. మహిళల అండర్ 70 కిలోల విభాగంలో పాకిస్తాన్ జూడోకాన్ బీనిష్ ఖాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్న పూజ చివరికి విజేతగా నిలిచింది. 3.03 నిమిషాల్లో ఆమె బినీష్‌ను ఓడించింది. కాగా, మహిళల అండర్ 78 కిలోల విభాగంలో అరుణ తృటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. పాకిస్తాన్‌కు చెందిన ఫౌజియా ముంతాజ్ రౌండ్ రాబిన్ లీగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచినందుకు స్వర్ణ పతకాన్ని స్వీకరించగా, ఫైనల్ బౌట్‌లో కొద్దిగా వెనుకబడిన కారణంగా అరుణ రజత పతకానికి పరిమితం కావాల్సి వచ్చింది. పురుషుల అండర్ 100 కిలోల విభాగం ఫైనల్‌లో పాకిస్తాన్‌కు చెందిన షా హుస్సేన్‌తో తలపడిన శుభం కుమార్ పరాజయాన్ని ఎదుర్కొని, రజత పతకాన్ని అందుకున్నాడు. మొత్తం మీద 12 విభాగాల్లో పోటీలు జరగ్గా భారత్ తొమ్మిది స్వర్ణం, మూడు రజత పతకాలను సాధించింది. పాకిస్తాన్ రెండు స్వర్ణం, మరో రెండు రజతం, ఎనిమిది కాంస్య పతకాలను అందుకోగా, నేపాల్ ఒక స్వర్ణం, రెండు రజతం, ఆరు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది.