క్రీడాభూమి

ప్లే ఆఫ్‌లో ఎవరితో ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లే ఆఫ్‌లో భాగంగా ఈనెల 16న ముంబయిలో జరిగే మొదటి క్వాలిఫయర్‌లో, గ్రూప్ దశలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. అనంతరం, 17న జరిగే ఎలిమినేటర్‌లో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీ కొంటాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌కు చేరుతుంది. అక్కడ, మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన జట్లకు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. మూడు, నాలుగు స్థానాల్లోని జట్లు ఏ మ్యాచ్‌ని ఓడినా ఇంటిదారి పడుతుంది.