క్రీడాభూమి

ఫిక్సింగ్ ఆరోపణలతో మ్యాచ్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోమ్స్, మే 19: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో స్వీడన్ ఫుట్‌బాల్ సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఎఫ్) గోథెన్‌బర్గ్, ఎఐకె జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ని వాయిదా వేసింది. ఎఐకెకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక ఆటగాడిని కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు సంప్రదించి, భారీ మొత్తాన్ని ఇవ్వచూపారన్న సమాచారాన్ని అందుకున్న ఎస్‌ఎఫ్‌ఎఫ్ వెంటనే విచారణకు ఆదేశించింది. సదరు ఆటగాడిని పిలిపించి విచారణ జరిపింది. ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్‌ని వాయిదా వేసింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడడం లేదా ప్రయత్నించడం శిక్షార్హమైన నేరాలని, కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఎఫ్‌ఎఫ్ ప్రకటించింది. సమగ్ర విచారణ తర్వాత వాస్తవాలు వెల్లడవుతాయని పేర్కొంది.
ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో
ఫైనల్‌కు భారత్
షాంఘై, మే 19: వరల్డ్ కప్ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత జట్టు ఫైనల్ చేరి, కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. అభిషేక్ వర్మ, చిన్న రాజు శ్రీ్ధర్, అమన్‌జిత్ సింగ్‌తో కూడిన భారత జట్టు సెమీ ఫైనల్‌లో రియ్ విల్డ్, స్టీవ్ ఆండర్సన్, బ్రాండెన్ గెలిస్టిన్ సభ్యులుగా ఉన్న అమెరికాను 232-230 పాయింట్ల తేడాతో ఓడించింది. ఈ పోరు చివరి వరకూ హోరాహోరీగా మారింది. మిక్స్ పెయిర్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ వన్నన్‌తో కలిసి బరిలోకి దిగిన అభిషేక్ వర్మ మూడో స్థానానికి జరిగే పోటీకి అర్హత సంపాదించాడు.