క్రీడాభూమి

మెక్‌గ్రెగర్‌తో మేవెదర్ ఫైట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, మే 19: ఓటమి అనేదే తెలియని బాక్సింగ్ సూపర్ స్టార్ ఫ్లోయిడ్ మేవెదర్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడని, తన తర్వాతి ఫైట్‌లో మిక్స్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ కానర్ మెక్‌గ్రెగర్‌ను ఢీ కొంటాడని వార్తలు వచ్చాయి. ఈ ఫైట్‌కు సంబంధించిన అగ్రిమెంట్‌పై మెక్‌గ్రెగర్ ఇప్పటికే సంతకం చేశాడని ప్రమోటర్ డానా వైట్ ప్రకటించగా, మేవెదర్ ఇంత వరకూ స్పందించలేదని సమాచారం. అయితే, 2015లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మేవెదర్ తన నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నాడని, మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నాడని చాలకాలంగా వార్తలు వస్తున్నాయి. సాధ్యమైనంత త్వరలో అతను మళ్లీ ఫైట్‌కు సిద్ధమవుతాడని కూడా అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, 40 ఏళ్ల మేవెదర్ ఇంకా ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన ఏదీ చేయలేదు. కెరీర్‌లో 49 ఫైట్స్‌లో పాల్గొన్న అతను అన్నింటిలోనూ విజయాలను నమోదు చేశాడు. వీటిలో 26 నాకౌట్ ద్వారా సాధించినవి కావడం గమనార్హం. మేవెదర్ కెరీర్‌ను కొనసాగించాలన్న డిమాండ్ బాక్సింగ్ ప్రపంచంలో బలంగా వినిపిస్తున్నది.