క్రీడాభూమి

జెనీవా ఓపెన్‌లో పేస్ జోడీ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, మే 23: జెనీవా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి స్కాట్ లిప్‌స్కీ (అమెరికా) శుభారంభాన్ని సాధించారు. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో వీరు స్పెయిన్‌కు చెందిన టామీ రాబెర్డో, డేవిడ్ మర్రెరో జోడీని మట్టికరిపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఆరంభం నుంచే హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్, లిప్‌స్కీ తొలుత కాస్త వెనుకబడి మొదటి సెట్‌ను 6-7(3) తేడాతో కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించారు. ఫలితంగా 7-6(3), 10-4 తేడాతో వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని ప్రత్యర్థులను చిత్తు చేశారు.
ఎటిపి-250 ఈవెంట్‌లో
నెడుంచెజియన్‌కు ఓటమి
ఇదిలావుంటే, లియోన్‌లో జరుగుతున్న ఎటిపి-250 ఈవెంట్‌లో వైల్డ్‌కార్డుతో ఆడుతున్న భారత ఆటగాడు జీవన్ నెడుంచెజియన్, అతని భాగస్వామి క్రిస్ట్ఫోర్ రంగ్‌కట్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. తొలి రౌండ్‌లో వీరు 3-6, 6-3, 5-10 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన పటిష్టమైన నిక్ కిర్గియోస్, మ్యాట్ రీడ్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు.
పాక్ జట్టులోకి హారిస్ సొహైల్
ఉమర్ అక్మల్‌కు బదులుగా
చాంపియన్స్ ట్రోఫీలో చోటు
కరాచీ, మే 23: చాంపియన్స్ ట్రోఫీ (సిటి) టోర్నమెంట్‌లో తలపడే పాకిస్తాన్ జట్టులో ఉమర్ అక్మల్‌కు బదులుగా బ్యాట్స్‌మన్ హారిస్ సొహైల్‌ను చేర్చుకున్నారు. ఈ టోర్నమెంట్‌కు ముందు బర్మింగ్ హామ్‌లో పాక్ ఆటగాళ్లకు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో ఉమర్ అక్మల్ విఫలమవడంతో ఈ మార్పు చేయాల్సి వచ్చింది. మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్‌హక్ నేతృత్వంలోని పాక్ జాతీయ క్రికెట్ సెలెక్షన్ కమిటీ తమ జాతీయ క్రికెట్ అకాడమీలో ఉమర్ అమిన్‌తో పాటు సొహైల్, ఆసిఫ్ జకీర్‌లను ఫిట్నెస్ పరీక్షలకు రావలసిందిగా పిలిచింది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు బర్మింగ్‌హామ్‌లో పాక్ ఆటగాళ్లకు నిర్వహించిన రెండు ఫిట్నెస్ పరీక్షల్లో ఉమర్ అక్మల్ విఫలమవడంతో ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిందిగా అతనికి స్పష్టం చేశారు. ఉమర్ అక్మల్‌కు బదులుగా పాక్ జట్టులో చోటు దక్కించుకున్న హారిస్ మోకాలి గాయం కారణంగా దాదాపు రెండేళ్ల నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో ఈ గాయం నుంచి బయటపడేందుకు ఆస్ట్రేలియాలో శస్తచ్రికిత్స చేయించుకున్న హారిస్ ఇటీవలే దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులోకి వచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో జూన్ 4న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో జరిగే మ్యాచ్‌తో పాక్ తన పోరాటాన్ని ఆరంభించనున్న విషయం తెలిసిందే.