క్రీడాభూమి

రికార్డుల కోసం ఆడలేదు : ఝులన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 23: తానెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదని, మహిళల వన్‌డే మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు సాధించిన ఝులన్ గోస్వామి చెప్పింది. దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన చతుర్ముఖ సిరీస్‌లో భారత జట్టు విజయం సాధించడం వచ్చే నెలనుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌కు మంచి సన్నాహకంగా ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయ పడింది. 34 ఏళ్ల గోస్వామి దాదాపు పదేళ్లుగా ఆస్ట్రేలియా మహిళా ఫాస్ట్‌బౌలర్ క్యాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్ పేరున్న 180 వికెట్ల రికార్డును ఇటీవలే చెరిపి వేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. క్రికెట్ లాంటి టీమ్ స్పోర్ట్స్‌లో వ్యక్తిగత రికార్డులను ఎవరూ పెద్దగా పట్టించుకోరని, అయినా తాను ఎప్పుడూ రికార్డులకోసం ఆడలేదని, క్రికెట్ అంటే ఎంతో ఇష్టం గనుకనే ఆడుతున్నానని చెప్పింది. ఆట కొనసాగిస్తూ ఉంటే రికార్డులు వాటంతట అవే వస్తాయని చెప్పింది. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని ఝులన్ మంగళవారం కోల్‌కతా చేరుకుంది.ఈ నెల 21న పోచెఫ్‌స్ట్రూమ్‌లో జరిగిన ఫైనల్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించి చతుర్ముఖ సిరీస్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ చతుర్ముఖ సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికాలే కాకుండా జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు కూడా పాల్గొన్నాయి. ఈ సిరీస్ కోసం తాము ఆరునెలల పాటు సంసిద్ధమయ్యామని, టోర్నమెంట్‌లో తాము చాలా బాగా ఆడామని ఆమె చెప్పింది. అయితే తమ జట్టుకు నిజమైన పరీక్ష ప్రపంచ కప్ అని ఆమె అభిప్రాయ పడింది. ప్రపంచ కప్‌లో జూన్ 24న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొననుంది.