క్రీడాభూమి

తొమర్‌కు భారీ బొనాంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రో-కబడ్డీ లీగ్ వేలంలో అత్యధిక ధర ప రూ.93 లక్షలకు ఉత్తరప్రదేశ్ జట్టు కైవసం
విదేశీ ఆటగాళ్లలో అబోజర్‌కు రూ.50 లక్షలు ప రెండు రోజుల్లో రూ.46.99 కోట్లు కుమ్మరించిన 12 జట్లు

న్యూఢిల్లీ, మే 23: ప్రో-కబడ్డీ లీగ్ ఆటగాళ్ల వేలంలో భారత జాతీయ జట్టు ఆటగాడు నితిన్ తొమర్‌కు భారీ బొనాంజా లభించింది. ఈ ఏడాది ఈ టోర్నమెంట్‌కు సంబంధించి సోమవారం తొలి రోజు ఏ-కేటగిరీలోని స్టార్ ఆటగాళ్లకు నిర్వహించిన వేలంలో ఉత్తరప్రదేశ్ జట్టు అనూహ్యంగా 93 లక్షల రూపాయలు వెచ్చించి అతడిని కైవసం చేసుకుంది. ఇంతముందు ఎడిషన్లలో మెరుపులు మెరిపించి అందరినీ అలరించిన మంజీత్ చిల్లార్‌ను జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు రూ.75.5 లక్షలకు కొనుగోలు చేయడంతో ప్రస్తుత వేలంలో అతనే అత్యంత ప్రియమైన ఆటగాడుగా నిలుస్తాడని విశే్లషకులు అంచనా వేశారు. అయితే సోమవారం రాత్రి జరిగిన రెండో దశ వేలంలో నితిన్ తొమర్‌కు భారీ ధర లభించడంతో అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి. గత ఏడాది ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న తొమర్‌ను దక్కించకునేందుకు ఉత్తరప్రదేశ్, తెలుగు టైటాన్స్ జట్లు ఈ వేలంలో భీకరంగా పోటీపడ్డాయి. అయితే రూ.20 లక్షల బేస్ ప్రైస్ (ఆరంభ ధర)తో ఈ వేలంలో పాల్గొన్న తొమర్‌ను ఉత్తరప్రదేశ్ జట్టు 93 లక్షల రూపాయలకు కొనుగోలు చేయడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ప్రో-కబడ్డీ లీగ్ తొలి సీజన్‌లో జరిగిన వేలంలో అత్యధికంగా రాకేష్ కుమార్‌కు లభించిన రూ.12.80 లక్షల బిడ్డింగ్ ధరతో పోలిస్తే ప్రస్తుతం తొమర్‌కు లభించిన ధర 626 శాతం అధికంగా ఉండటం గమనార్హం.
ప్రస్తుత సీజన్ ఆటగాళ్ల వేలంలో తొమర్‌తో పాటు రోహిత్ కుమార్, మన్‌జీత్ చిల్లార్, సూర్జిత్ సింగ్, కె.సెల్వమణి లాంటి దేశీయ ఆటగాళ్లకు కూడా మంచి ధర లభించింది. వీరిలో రోహిత్ కుమార్‌ను రూ.81 లక్షలకు బెంగళూరు బుల్స్ జట్టు దక్కించుకోగా, మన్‌జీత్ చిల్లార్‌ను రూ.75.5 లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్, సూర్జిత్ సింగ్‌ను రూ.73 లక్షలకు బెంగాల్ వారియర్స్, సెల్వమణిని రూ.73 లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్, రాజేష్ నర్వాల్‌ను రూ.69 లక్షలకు ఉత్తరప్రదేశ్, సందీప్ నర్వాల్‌ను రూ.66 లక్షలకు పునేరీ పల్టన్, అమిత్ హుడాను రూ.63 లక్షలకు తమిళనాడు, జీవ్ కుమార్‌ను రూ.52 లక్షలకు ఉత్తరప్రదేశ్, జస్వీర్ సింగ్‌ను రూ.51 లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్, రవీందర్ పహాల్‌ను రూ.50 లక్షలకు బెంగళూరు బుల్స్, అజయ్‌ని రూ.48.50 లక్షలకు బెంగళూరు బుల్స్, కషిలింగ్ అడాకేని రూ.48 లక్షలకు యుముంబా, రణ్ సింగ్‌ను రూ.47.50 లక్షలకు బెంగాల్ వారియర్స్, మొహిత్ చిల్లార్‌ను రూ.46.50 లక్షలకు హర్యానా జట్లు కొనుగోలు చేశాయి.
కాగా, విదేశీ ఆటగాళ్లలో ఇరాన్‌కు చెందిన అబోజర్ మొహాజెర్మిఘనీకి అధిక ధర లభించింది. ప్రో-కబడ్డీ లీగ్‌లో కొత్తగా రంగప్రవేశం చేసిన గుజరాత్ జట్టు రూ.50 లక్షలకు అతడిని దక్కించుకోగా, ఇతర విదేశీ ఆటగాళ్లలో అబోల్‌ఫజెల్ మఘ్సోడ్లో (ఇరాన్)ను రూ.31.8 లక్షలకు దబాంగ్ ఢిల్లీ, ఫర్హద్ రహీమీ మిలాగర్ధన్ (ఇరాన్)ను రూ.29 లక్షలకు తెలుగు టైటాన్స్, ఖొమ్సన్ తొంగ్‌కమ్ (్థయిలాండ్)ను రూ.20.4 లక్షలకు హర్యానా, హాదీ ఒస్టోరక్ (ఇరాన్)ను రూ.18.6 లక్షలకు యుముంబా జట్లు కొనుగోలు చేశాయి.
రెండో రోజు వేలంలో
సూజర్‌కు అధిక ధర
రెండు రోజుల పాటు కొనసాగిన ఈ వేలంలో మంగళవారం చివరి రోజు బి, సి, డి కేటగిరీల్లోని దేశవాళీ ఆటగాళ్లకు నిర్వహించిన వేలంలో సూరజ్ దేశాయ్‌కి భారీ ధర లభించింది. దబాంగ్ ఢిల్లీ రూ.52.50 లక్షలు వెచ్చించి దేశాయ్‌ని దక్కించుకుంది. రెండు రోజుల్లో వేలానికి ఎంపిక చేసిన 227 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు 12 ఫ్రాంచైజ్‌లు కలిపి మొత్తం 46.99 కోట్ల రూపాయలను వెచ్చించాయి. కాగా, ప్రస్తుత వేలంలో ఒక ఆటగాడి కొనుగోలు కోసం ఒక జట్టు వెచ్చించిన అత్యధిక మొత్తాన్ని ఆ జట్టులో కొనసాగుతున్న ఎలైట్ ఆటగాళ్లకు తుది వేతనంగా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే నాలుగో సీజన్‌లో ఆడిన జట్లలో ప్రతి జట్టును ప్రస్తుత సీజన్‌లో ఒక్క ఎలైట్ ఆటగాడిని అట్టిపెట్టుకునేందుకు మాత్రమే అనుమతించారు. ఇలా అట్టిపెట్టుకునే ఆటగాడు దేశవాళీ ఆటగాడైనా లేక విదేశీ ఆటగాడైనా కావచ్చు.
ఈవిధంగా వివిధ జట్లలో కొనసాగుతున్న వారిలో స్టార్ ఆటగాళ్లు రాహుల్ చౌదరి (తెలుగు టైటాన్స్), అనూప్ కుమార్ (యుముంబా), జంగ్ కున్ లీ (బెంగాల్ వారియర్స్), ఆశిష్ కుమార్ (బెంగళూరు బుల్స్), మిరాజ్ షేక్ (దబాంగ్ ఢిల్లీ), ప్రదీప్ నర్వాల్ (పాట్నా పైరేట్స్), దీపక్ హుడా (పునేరీ పల్టన్) ఉన్నారు. అయితే జైపూర్ పింక్ పాంథర్స్ మాత్రం నాలుగో సీజన్‌లో పాల్గొన్న ఆటగాళ్లలో ఒక్కరిని కూడా అట్టిపెట్టుకోలేదు.

చిత్రం.. ప్రో-కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో ప్రత్యర్థులను దునుమాడుతున్న నితిన్ తొమర్ (ఫైల్ ఫొటో)