క్రీడాభూమి

తప్పటడుగు వేస్తే ఇంతే సంగతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ది ఓవల్ (లండన్), మే 31: అభిమానులకు వనే్డ క్రికెట్ విందును అందించేందుకు ఎన్నో రకాలుగా ప్రత్యేకతను సంతరించుకున్న చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సిద్ధమైంది. గురువారం ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో మొదలుకానున్న ఈ టోర్నీలో ప్రతి జట్టూ ఆచితూచి ఆడాలి. ఏమాత్రం తప్పటడుగు వేసినా ఇంటిదారి పట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టే దీనిని ఒకప్పుడు ఐసిసి నాకౌట్ టోర్నీగా పిలిచేవారు. గ్రూప్ దశలో లెక్కకు మించిన మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటే, సెమీస్ లేదా నాకౌట్ దశకు చేరడం కష్టమేమీ కాదు. ఒక జట్టు బాగా ఆడకపోయినా, ఇతర జట్ల మ్యాచ్ ఫలితాల వల్ల నాకౌట్‌కు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. పైగా ప్రపంచ కప్ వంటి టోర్నీల్లో జట్ల సంఖ్య పదికంటే ఎక్కువే ఉంటుంది. కానీ, ‘మినీ ప్రపంచకప్’గా పేర్కొనే చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లే ఉంటాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాలను ఆక్రమించిన జట్లకే చోటు దక్కుతుంది. తొమ్మిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు ఈసారి చాంపియన్స్ ట్రోఫీలో చోటు లేదంటే, పోరు తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే, ఏ ఒక్క మ్యాచ్‌లో నిర్లక్ష్యంగా ఆడినా, భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఫైనల్‌సహా కేవలం 15 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి మ్యాచ్‌కీ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఫేవరిట్స్ భారత్, ఆస్ట్రేలియా
ఎనిమిదో చాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫేవరిట్స్‌గా బరిలోకి దిగుతున్నాయి. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పోటీపడుతున్నది. గత సీజన్‌లో కేవలం ఎనిమిది వనే్డ ఇంటర్నేషనల్స్ మాత్రమే ఆడినప్పటికీ, అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో టీమిండియా పటిష్టంగా కనిపిస్తున్నది. టైటిల్‌ను నిలబెట్టుకోగల సత్తా కోహ్లీ సేనకు ఉన్నప్పటికీ, చాలాకాలంగా పట్టిపీడిస్తున్న నిలకడలేమి సమస్యకు తెరదించకపోతే కష్టాలు తప్పవు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ తమదైన ఆటతో రాణించాల్సిన అవసరం ఉంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫామ్‌ను సంపాదించుకోవాలి. లేకపోతే, ఫలితాలు ఏ విధంగానైనా ఉండవచ్చు.
మరోవైపు, స్టీవెన్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా కూడా టైటిల్‌పై కనే్నసింది. డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్ ఆ జట్టు బలాన్ని పెంచుతున్నాడు. కాగా, ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్‌ను సాధించాలన్న పట్టుదలతో ఉంటే, కేన్ విలియమ్‌సన్ నాయకత్వం వహిస్తున్న న్యూజిలాండ్, మష్రాఫ్ ముర్తాజా కెప్టెన్‌గా ఉన్న బంగ్లాదేశ్, కొత్త కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ కనుసన్నల్లోని పాకిస్తాన్, ఏంజెలో మాథ్యూస్ సారథ్యం వహిస్తున్న శ్రీలంక జట్లు కూడా గట్టిపోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌కీ ఎంతో ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో, గతంలో మాదిరిగానే ఈసారి కూడా చాంపియన్స్ ట్రోఫీ ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది.