క్రీడాభూమి

కెన్యాపై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైరోబీ: కెన్యాను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధించడం ఖాయంగా కనిపిస్తున్నది. దశాబ్దాల కాలంగా చాలా మంది అథ్లెట్లు నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడుతున్నట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) అధ్యయనంలో వెల్లడి కావడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్), అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. వాటిలో భాగంగా డోపింగ్ నిరోధక విభాగాలను నెలకొల్పాలని అన్ని దేశాలకు ఆదేశాలు జారీ చేశాయి. అయితే, డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కెన్యా ఈ ఆదేశాలపై స్పందించలేదు. నిర్ణీత గడువులోగా డోపింగ్ నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ఐఎఎఎఫ్ చీఫ్ సెబాస్టియన్ కో జారీ చేసిన హెచ్చరికలను కూడా కెన్యా పట్టించుకోలేదు. దీనితో ఒలింపిక్స్ నుంచి కెన్యాను బహిష్కరించే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు కో తెలిపాడు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాడు. ఇలావుంటే, డోపింగ్ నిరోధక విభాగం చేసిన హెచ్చరికల నేపథ్యంలో, ప్రపంచ దేశాలన్నీ ఐఎఎఎఫ్ ఆదేశాలను మన్నించాలని, లేకపోతే తీవ్రపరిణామాలను ఎదుర్కోక తప్పదని నిపుణులు అంటున్నారు. కెన్యాలో డోపింగ్ కేంద్రం లేకపోతే, డోపింగ్ పరీక్షలకు హాజరుకాకుండానే అక్కడి అథ్లెట్లు ఒలింపిక్స్‌కు హాజరుకావాల్సి వస్తుంది. అయితే, తాజా నిబంధనల ప్రకారం డోపింగ్ పరీక్షలో విఫలమైన వారితోపాటు, అసలు పరీక్షకే హాజరుకాని వారిపైనా వేటుపడుతుంది. ఈ నిబంధన ప్రకారం కెన్యా అథ్లెట్లపై ఒలింపిక్స్‌కు హాజరుకాకుండా నిషేధం వేటు పడే ప్రమాదం కనిపిస్తున్నది.