క్రీడాభూమి

హాకీ స్టార్ సర్దార్ సింగ్ పట్ల బ్రిటన్ అనుచిత ప్రవర్తన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: భారత హాకీ స్టార్ సర్దార్ సింగ్ పట్ల బ్రిటన్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో సర్దార్ సింగ్‌పై దాదాపు ఏడాది క్రితం నమోదైన కేసులో విచారణకు రావలసిందిగా బ్రిటన్ పోలీసులు సోమవారం అతడిని ఆదేశించారు. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) సెమీ-ఫైనల్స్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 7-1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించిన కొద్ది గంటలకే యార్క్‌షైర్ పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేశారు. విచారణ నిమిత్తం సర్దార్ సింగ్ లీడ్స్‌కు రావాలని స్పష్టం చేస్తూ లండన్‌లోని భారత హాకీ జట్టు యాజమాన్యానికి వారు కబురు పంపారు. సర్దార్ సింగ్ భారత్‌తో పాటు బ్రిటన్‌లో తనపై అత్యాచారానికి, లైంగిక దాడికి పాల్పడ్డాడని అతని ప్రియురాలిగా చెప్పబడుతున్న బ్రిటిష్-ఇండియా హాకీ ప్లేయర్ అస్పాల్ భోగల్ గత ఏడాది ఆరోపించడంతో అతనిపై ఈ కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం పెద్ద అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆడుతూ బిజీగా ఉన్న సర్దార్ సింగ్‌కు యార్క్‌షైర్ పోలీసులు ముందస్తు సమాచారాన్ని ఇవ్వకుండా విచారణకు రమ్మని ఆదేశించడం పట్ల భారత హాకీ జట్టు యాజమాన్యం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సర్దార్ సింగ్‌ను ప్రశ్నించేందుకు బ్రిటన్ అధికారులు తీసుకున్న నిర్ణయం అనుచితంగా ఉందని, వారి తీరును ఖండిస్తున్నానని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) చీఫ్, హాకీ ఇండియా మాజీ కోచ్ నరీందర్ బాత్రా స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆటగాడిగా ఎంతో ఖ్యాతి పొందిన సర్దార్ సింగ్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పెద్ద టోర్నమెంట్‌కు మధ్యలో విచారణకు రమ్మని ఎలా పిలుస్తారని ఆయన బ్రిటన్ అధికారులను నిలదీశారు.

చిత్రం.. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్