క్రీడాభూమి

సంబరాలు చేసుకుంటున్న పాక్ ఆర్మీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 19: చాంపియన్స్ ట్రోఫీలో 180 పరుగుల తేడాతో దాయాది భారత్‌పై చిరస్మరణీయమైన విజయాన్ని పాకిస్తాన్ నమోదు చేయటంపై ఆ దేశ ఆర్మీ సంబరాలు చేసుకుంది. బలూచిస్తాన్ సెక్టార్‌లోని సైనిక శిబిరంలో పాక్ సైనికులు ఆనందంతో కేరింతలు కొట్టిన ఫోటోలను ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా విజయ సంకేతంతో ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘ఇదే మన బలోచిస్తాన్. జోక్యం చేసుకోకండి. తొలగిపొండి.’’ అని పాక్ మిలటరీ ప్రతినిధి జనరల్ అసిఫ్ గఫూర్ పోస్ట్ చేసారు. నిరుడు ఆగస్టు 15న భారత ప్రధాని నరేంద్రమోదీ బలోచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. శ్రీనగర్‌లో పాక్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్న వీడియో క్లిప్‌ను కూడా ఆయన పోస్ట్ చేస్తూ ‘‘ ఇదిగో ఇదీ శ్రీనగర్’’ అని రాశారు.