క్రీడాభూమి

ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో చైనా టైటిల్ సాధించింది. ఫైనల్ పోరులో ఈ జట్టు 3-2 తేడాతో జపాన్‌ను ఓడించింది. ఆరంభంలో ఆధిపత్యాన్ని కనబరచిన జపాన్ ఆతర్వాత చైనా ధాటిని ఎదురునిలవలేకపోయింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో షిజియాన్ వాంగ్‌ను ఒకుహరా నొజొమీ 17-21, 21-16, 21-15 తేడాతో ఓడించింది. అనంతరం డబుల్స్ తొలి మ్యాచ్‌లో ఇంగ్ లివో, క్వింగ్ తియాన్ జోడీపై మిసాకీ మత్సుతొమో, అయాకా తకహషి జోడీ 21-12, 21-16 ఆధిక్యంతో విజయం సాధించి, జపాన్ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. అయితే, ఆతర్వాత చైనా విజృంభణ మొదలైంది. రెండో సింగిల్స్‌లో యూ సున్ 22-20, 21-19 తేడాతో సయాకా సాతోను ఓడించి, చైనా తరఫున శుభారంభం చేసింది. రెండో డబుల్స్‌లో యూ లివో, యువాంటింగ్ తాంగ్ జోడీ 21-11, 21-10 తేడాతో నవోకో ఫకూమా, కురుమీ యోనావో జోడీని చిత్తుచేసి, స్కోరును సమం చేసింది. చివరిదైన మూడో సెమీ ఫైనల్‌లో బింగ్‌జియావో హి 21-18, 21-12 స్కోరుతో యు హషిమొతోపై విజయాన్ని నమోదు చేసి, చైనాను విజయపథంలో నడిపింది.
పురుషుల సెమీస్‌లో భారత్
పురుషుల విభాగంలో భారత జట్టు సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో మలేసియాతో తలపడిన ఈ జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది. మొదటి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-14, 21-15 తేడాతో జుల్ఫడ్లి జుల్క్ఫ్లీపై సులభంగా నెగ్గాడు. అనంతరం డబుల్స్ మ్యాచ్‌లో మనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీ 10-21, 22-20, 21-16 తేడాతో జువాన్ షెన్‌లో, కియాంగ్ మెంగ్ తాన్ జోడీపై గెలిచి భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. కానీ, ఆతర్వాత భారత్‌కు వరుసగా రెండు పరాజయాలు ఎదురయ్యాయి. రెండో సింగిల్స్‌లో అజయ్ జయరామ్‌ను ఇస్కందర్ జుల్కర్‌మైన్ 17-21, 21-12, 21-16 తేడాతో ఓడించాడు. రెండో డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, అక్షయ్ దివాల్కల్ జోడీపై యూ సిన్ ఆంగ్, ఎ ఇ తియేవో జోడీ 21-14, 14-21, 21-12 ఆధిక్యంతో గెలుపొందింది. దీనితో కీలకంగా మారిన చివరి సింగిల్స్‌లో ప్రణయ్ 21-12, 22-20 తేడాతో టెక్ జీ ఊను ఓడించి భారత్‌ను సెమీ ఫైనల్ చేర్చాడు.

శాంతిని పరిరక్షించండి
జాట్‌లకు సెవాగ్ వినతి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: శాంతిని పరిరక్షించాలని జాట్ కులస్తులకు భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్ విజ్ఞప్తి చేశాడు. తమను బిసిల్లో చేర్చాలంటూ జాట్‌లు చేస్తున్న ఆందోళనలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంపై సెవాగ్ స్పందిస్తూ, ఆందోళన తప్పుకాదని, అయితే, శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేయాలని సూచించాడు. తాను కూడా జాట్ కులస్తుడినేనని పేర్కొన్న అతను సైన్యం నుంచి క్రీడల వరకూ వివిధ రంగాల్లో తమ కులస్తులు అందిస్తున్న సేవలను ప్రశంసించాడు. ఆందోళన హింసాత్మకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. హర్యానాకు చెందిన బాక్సర్ విజేందర్ సింగ్ కూడా జాట్‌ల ఉద్యమం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. హింసాత్మక విధానాలు సరికావని అన్నాడు.