క్రీడాభూమి

గణాంకాల్లో విండీస్ టాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య ఇప్పటి వరకూ 116 వనే్డ ఇంటర్నేషనల్స్ జరిగాయి. భారత్ 53 విజయాలు నమోదు చేయగా, విండీస్ 60 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. రెండు వనే్డల్లో ఫలితం వెల్లడికాలేదు. ఈ గణాంకాలను బట్టి చూస్తే భారత్‌పై విండీస్ ఆధిపత్యం స్పష్టమవుతుంది. అయితే, ఇటీవల కాలంలో ఆ జట్టు దారుణ వైఫల్యాలను చవిచూస్తున్న నేపథ్యంలో, భారత్‌ను ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు.
రెండు జట్ల మధ్య జరిగిన వనే్డల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు...
అత్యధిక పరుగులు: సచిన్ తెండూల్కర్ (39 మ్యాచ్‌లు/ 1,573 పరుగులు).
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు: వీరేందర్ సెవాగ్ (2011 ఇండోర్ మ్యాచ్‌లో 149 బంతుల్లో 219 పరుగులు).
అత్యధిక శతకాలు: క్రిస్ గేల్, సచిన్ తెండూల్కర్ (ఇద్దరూ చెరి నాలుగు సెంచరీలు చేశారు/ గేల్ 36 మ్యాచ్‌లు ఆడితే, సచిన్ 39 మ్యాచ్‌లు ఆడాడు).
అత్యధిక అర్ధ శతకాలు: సచిన్ తెండూల్కర్ (39 మ్యాచ్‌ల్లో 11 హాఫ్ సెంచరీలు/ ఇందులో నాలుగు సెంచరీలు లేవు).
డకౌట్ వీరులు: ఎక్కువసార్లు డకౌటైన బ్యాట్స్‌మెన్ రికార్డును క్రిస్ గేల్, సచిన్ తెండూల్కర్ పంచుకుంటున్నారు. ఇద్దరూ చెరి ఐదుసార్లు సున్నాకే వెనుదిరిగారు.
ఎక్కువ వికెట్లు: కొట్నీ వాల్ష్ (38 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు).
ఉత్తమ బౌలింగ్: అనిల్ కుంబ్లే (1993 కోల్‌కతా మ్యాచ్‌లో 12 పరుగులకు 6 వికెట్లు).
ఒక సిరీస్‌లో ఎక్కువ వికెట్లు: పాట్రిక్ పాటర్సన్ (6 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు).
అత్యధిక ఎక్‌స్ట్రాలు: కెమర్ రోచ్ (2011 ఇండోర్ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన అతను 88 పరుగులు సమర్పించుకున్నాడు).
అత్యుత్తమ ఎకానమీ రేట్: కపిల్ దేవ్ (1989లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన వనే్డలో అతను 7 ఓవర్లు బౌల్ చేశాడు. వీటిలో నాలుగు మెయిడిన్లుకాగా, కేవలం నాలుగు పరుగులిచ్చి, 0.57 ఎకానమీ రేట్‌ను నమోదు చేశాడు).
ఎక్కువ మ్యాచ్‌లు: శివనారైన్ చందర్ పాల్ (46 మ్యాచ్‌లు).
కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచ్‌లు: వివియన్ రిచర్డ్స్ (20).
అత్యధిక భాగస్వామ్యం: వివియన్ రిచర్డ్స్/ గార్డెన్ గ్రీనిడ్జి (1983 జంషెడ్పూర్ మ్యాచ్‌లో 221 పరుగులు).
అత్యధిక జట్టు స్కోరు: భారత్ (2011 ఇండోర్ వనే్డలో 5 వికెట్లకు 418).
అత్యల్ప స్కోరు: భారత్ (1993 అహ్మదాబాద్ మ్యాచ్‌లో 100 ఆలౌట్).