క్రీడాభూమి

కాంట్రాక్టు సొమ్ముపై క్రికెటర్ల అసంతృప్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: కోట్లకు కోట్లు గడిస్తున్నా భారత క్రికెటర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. కోచ్ అనిల్ కుంబ్లేతో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విభేదాలు తలెత్తడానికి ఇదే ప్రధానకారణ మన్న వాదన వినిపిస్తున్నది. ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌కు వెళ్లిన టీమిండియా స్వదేశానికి వచ్చిన వెంటనే కాంట్రాక్టు సొమ్ము పెంచాలన్న డిమాండ్‌ను వినిపించే అవకాశం ఉం ది. నిజానికి తాజా కాంట్రాక్టులో ఆటగాళ్ల ఫీజును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) భారీగా పెంచింది. ‘ఎ’ గ్రేడ్ దక్కించుకున్న ఏడుగురికి ఇకపై రెండు కోట్ల రూపాయల ఫీజు లభిస్తుంది. గ్రేడ్ ‘బి’ కాంట్రాక్టులో ఉన్న తొమ్మిది మందికి తలా కోటి రూపాయలు లభిస్తాయి. కాగా, యాభై లక్షల విలువ చేసే ‘సి’ గ్రేడ్ కాంట్రాక్టుకు మొత్తం 16 మందిని ఎంపిక చేశారు. మొత్తం మీద తాజా కాంట్రాక్టులు 32 మంది క్రికెటర్లకు లభించింది. సెంట్రల్ కాంట్రాక్టు ఫీజును భారీగా పెంచాలని బిసిసిఐ ఇది వరకే చేసిన ప్రతిపాదనలకు, పాలనా వ్యవహారాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు నియమించిన చేసిన నలుగు సభ్యులతో కూడిన కమిటీ (సిఒఎ) ఆమోద ముద్ర వేసింది. దీనితో భారత క్రికెటర్ల ఫీజు అమాంతం పెరిగింది. గతంలో గ్రేడ్ ‘ఎ’ ఆటగాళ్లకు ఏటా కోటి రూపాయల ఫీజు లభించేది. అదే విధంగా ‘బి’ గ్రేడ్ క్రికెటర్లకు 60 లక్షలు, ‘సి’ గ్రేడ్‌లో ఉన్నవారికి 35 లక్షల చొప్పున ఫీజు చెల్లించేవారు. ఇప్పుడు ‘ఎ’ గ్రేడ్‌కు రెండు కోట్లు, ‘బి’ గ్రేడ్‌కు ఒక కోటి, ‘సి’ గ్రేడ్‌కు 50 లక్షల రూపాయలు చొప్పున పెంచారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినా, ఆడకపోయినా వీరికి ఒప్పందం ప్రకారం ఆయా మొత్తాలు లభిస్తాయి. దీనికితోడు ఏ ఫార్మాట్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినా మ్యాచ్ ఫీజు ప్రత్యేకంగా లభిస్తుంది. అండార్స్‌మెంట్లు, వాణిజ్య ప్రకటనలు వంటి ఇతరత్రా మార్గాల్లో కోట్లాది రూపాయలు లభిస్తాయి. అన్నింటినీ మించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఉంది. కాంట్రాక్టు పొందిన వారిలో దాదాపుగా అందరూ ఇప్పుడు ఐపిఎల్‌లో ఆడుతున్నారు. ఐపిఎల్ వేలంలో ఎంత భారీ మొత్తాలు అందుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ ఆటగాళ్లకు ఏటా పది కోట్ల రూపాయలకుపైనే లభిస్తాయి. బిసిసిఐ కాంట్రాక్టుతోనే ఆటగాళ్లకు పేరుప్రఖ్యాతులు వస్తాయన్నది నిజం. ఐపిఎల్ వేలంలో భారీ మొత్తాలు లభించాలన్నా, వాణిజ్య ప్రకటనలతో కోట్లకు పడగలెత్తాలన్నా ముందుగా బోర్డు కాంట్రాక్టు ఉండి తీరాలి. కానీ, ఐపిఎల్ వంటి టోర్నీల్లో కోట్లకు కోట్లు వెనకేసుకోవడానికి అలవాటుపడిన క్రికెటర్లు బిసిసిఐ కాంట్రాక్టు ద్వారా లభించే మొత్తాలపై పెదవి విరుస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో చాలా మంది టీమిండియా క్రికెటర్లు సమావేశమై, కాంట్రాక్టు ఫీజులపై చర్చించి, అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐపిఎల్ పూర్తయిన వెంటనే సిఒఎ సభ్యులను కలిసి, ఫీజు పెంపుదలతోపాటు కాంట్రాక్టు విధానంలో మార్పులపై తమ డిమాండ్లను వారి ముందు ఉంచుతారని తెలుస్తున్నది. జాతీయ జట్టుకు కోచ్‌గా ఉన్న మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆటగాళ్ల తరఫున వాకాల్తా పుచ్చుకున్నాడని అంటున్నారు. వాస్తవానికి సపోర్టింగ్ స్ట్ఫా జీతభత్యాలు కూడా భారీగానే పెరిగియాయి. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీ్ధర్ తాజా కాంట్రాక్టు ప్రకారం నెలకు 15 లక్షల రూపాయలు ఫీజు రూపంలో తీసుకోనున్నారు. ఐపిఎల్ జరిగే రెండు నెలలు నిమహాయించి, మిగతా పది నెలలూ వారికి 15 లక్షల రూపాయలు చొప్పున లభిస్తాయి. ఆ రెండు నెలల్లో వీరిద్దరూ సంబంధిత ఫ్రాంచైజీలకు సేవలందిస్తూ, అక్కడి నుంచి పారితోషికాన్ని తీసుకుంటారు. కోచ్ కుంబ్లే నెలకు 25 లక్షల రూపాయలు, సపోరిటంగ్ స్ట్ఫాలోని వారందరికీ నెలకు తలా పది లక్షలు చొప్పున ఫీజు చెల్లిస్తున్నారు. ఇంత భారీ మొత్తాలు లభిస్తున్నప్పటికీ, భారత క్రికెటర్లు, సపోర్టింగ్ స్ట్ఫా తమ వాటా మరింతగా పెరగాలని డిమాండ్ చేయడం విచిత్రం. వారి వాదన కూడా వింతగా ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో బిసిసిఐ ఆదాయం 1,365.35 కోట్ల రూపాయలు. అందులో ఆటగాళ్లకు కాంట్రాక్టు ఫీజు కింద 56.35 కోట్లు, ఇతరత్రా చెల్లింపుల కింద మరో 46.31 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. బోర్డు మొత్తం ఆదాయంలో ఇది చాలా తక్కువ శాతమని, కాబట్టి కాంట్రాక్టు మొత్తాలను మరింతగా పెంచాలన్నది ఆటగాళ్ల డిమాండ్. ఇతర దేశాల క్రికెటర్లతో పోల్చుకోవడం కూడా ఇటీవల ఫ్యాషన్‌గా మారింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ తమతమ దేశాల క్రికెట్ బోర్డుల నుంచి కాంట్రాక్టు ఫీజు కింద 8 నుంచి 12 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని, దానితో పోలిస్తే, ‘ఎ’ గ్రేడ్ క్రికెటర్లకు కోటి రూపాయలు చాలా తక్కువని క్రికెటర్లు అంటున్నారు. ‘బి’, ‘సి’ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్ల పరిస్థితి మరింత దారుణమని వాదిస్తున్నారు. కేవలం కాంట్రాక్టు ఫీజును మాత్రమే చూపిస్తూ, దాని ద్వారా లభిస్తున్న ఇతర ఆదాయాలను పరిగణలోకి తీసుకోకుండా భారత క్రికెటర్లు చేస్తున్న డిమాండ్ విచిత్రంగా ఉంది. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నా వారు నిత్య అసంతృప్తి వాదులే!