క్రీడాభూమి

అఫ్గాన్, ఐర్లాండ్ జట్లకు టెస్టు హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూన్ 22: అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లకు టెస్టు హోదా లభించింది. ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డులకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని మంజూరు చేయడం ద్వారా టెస్టు హోదాను కల్పించినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకూ పది జట్లకు టెస్టు హోదా ఉండగా, అఫ్గాన్, ఐర్లాండ్ చేరికతో ఈ సంఖ్య 12కు పెరిగింది. ఈ రెండు దేశాలు చాలాకాలంగా టెస్టు హోదా కోసం ప్రతిపాదనలు పంపుతునే ఉన్నాయి. ఇటీవలే ఈ దేశాల్లో జరిగే దేశవాళీ పోటీలకు ఫస్ట్‌క్లాస్ హోదాను ఇవ్వాలని ఐసిసి తీర్మానించింది. ఇప్పుడు టెస్టు హోదాను అందించింది.
ద్వైపాక్షిక సిరీస్‌లపై జోక్యం చేసుకోం..
రెండు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో జోక్యం చేసుకోమని ఐసిసి తేల్చిచెప్పింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడని భారత్ నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించాలని తీర్మానించడంతోపాటు, భారత్‌కు నోటీసు కూడా పంపింది. ఈ నేపథ్యంలో ఐసిసి కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఏవైనా కారణాల వల్ల ద్వైపాక్షిక సిరీస్‌లను ఒక దేశం రద్దు చేసుకుంటే, తప్పనిసరిగా ఆడి తీరాలని ఒత్తిడి తీసుకొచ్చే ప్రసక్తే లేదని ఐసిసి స్పష్టం చేసింది. ఇలాంటి అంశాలను ఆయా క్రికెట్ బోర్డులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితవు పలికింది.
భారత్‌కు 405 మిలియన్ డాలర్లు
బిసిసిఐకి ఐసిసి ద్వారా 405 మిలియన్ డాలర్లు లభించనున్నాయి. గతంలో ‘బిగ్ త్రీ’ పేరుతో ఐసిసి ఆదాయంలో భారత్ అత్యధిక వాటాను పొందుతుండగా, ఇటీవలే ఈ విధానానికి తెరపడిన విషయం తెలిసిందే. తాజా తీర్మానాల ప్రకారం వచ్చే మొత్తం బిసిసిఐ డిమాండ్ చేసినంత లేకపోయినా, మిగతా బోర్డులతో పోలిస్తే చాలా ఎక్కువే. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) 139 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది.

టెస్టు దేశాలు
1. ఆస్ట్రేలియా (1877 మార్చి 15), 2. ఇంగ్లాండ్ (1877 మార్చి 15), 3. దక్షిణాఫ్రికా (1889 మార్చి 12), 4. వెస్టిండీస్ (1923 జూన్ 23), 5. న్యూజిలాండ్ (1930 జనవరి 10), 6. భారత్ (1932 జూన్ 25), 7. పాకిస్తాన్ (1952 అక్టోబర్ 16), 8. శ్రీలంక (1982 ఫిబ్రవరి 17), 9. జింబాబ్వే (1992 అక్టోబర్ 18), 10. బంగ్లాదేశ్ (2000 నవంబర్ 10), 11. అఫ్గానిస్తాన్ (2017 జూన్ 22), 12. ఐర్లాండ్ (2017 జూన్ 22).