క్రీడాభూమి

గుర్తింపు ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 23: మహిళా క్రికెటర్లకు గుర్తింపు లభించడం లేదని భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఆవేదన వ్యక్తం చేసింది. క్రికెట్‌ను మతంలా ఆరాధించే దేశంలో మహిళా క్రికెట్ ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం ఇంగ్లాండ్‌తో భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది. శుక్రవారం నెట్స్‌కు హాజరైన తర్వాత ఆమె మాట్లాడుతూ మహిళా క్రికెట్ బాధ్యతను కూడా బిసిసిఐ తీసుకున్న తర్వాత, సుమారు రెండేళ్లుగా పరలిస్థితి కొంత వరకూ మారిందని చెప్పింది. పలు మ్యాచ్‌లు టీవీలో ప్రసారం కావడంతో మార్పు కనిపిస్తున్నదని, కానీ, జరగాల్సింది ఇంకా చాలా ఉందని వ్యాఖ్యానించింది. పురుషుల మాదిరిగానే మహిళా క్రికెటర్లు కూడా తరచు టీవీ, ఇతర మాధ్యమాల్లో కనిపిస్తుంటే, ఆదరణ క్రమంగా పెరుగుతుందని చెప్పింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, పురుషుల జట్టు నెలకొల్పిన ప్రమాణాలను అందుకోవడానికి కృషి చేస్తున్నామని తెలిపింది. మహిళా జట్టుకు ప్రతిసారీ పురుషుడే కోచ్‌గా ఉంటాడని, కాబట్టి, ప్రాక్టీస్ స్థాయి అద్భుతంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించేందుకు చివరి వరకూ ప్రయత్నిస్తామని తెలిపింది. అన్ని విభాగాల్లోనూ జట్టు సమతూకంగా ఉందని చెప్పింది.
ఈ ప్రశ్న వారిని అడుగుతారా?
‘పురుషుల విభాగంలో ఏ క్రికెటర్‌ను మీరు అభిమానిస్తారు’ అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నపై మిథాలీ రాజ్ తీవ్రంగా స్పందించింది. ఇదే ప్రశ్న పురుషులను అడుగుతారా అంటూ నిలదీసింది. ‘మీ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు? అని వారిని ప్రశ్నిస్తారా’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. తనను చాలా మంది ఈ ప్రశ్న అడిగారని, కానీ, ఇదే ప్రశ్నను ఇప్పటి వరకూ టీమిండియా ఆటగాళ్లలో ఎవరినీ ఆడగలేదని చెప్పింది. పురుషులు, మహిళల క్రికెట్ మధ్య ఉన్న తేడాను చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదని వ్యాఖ్యానించింది.

ఇంగ్లాండ్‌తో 2002లో జరిగిన టెస్టులో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ 214 పరుగులు సాధించింది. మహిళా టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు. ఆమెకు పద్మశ్రీ, అర్జున అవార్డులు దక్కాయి. 2005లో భారత జట్టు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ వరకూ చేరడంలో మిథాలీ కీలక పాత్ర పోషించింది. అయితే, టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపాలైంది.

చిత్రం.. మిథాలీ రాజ్