క్రీడాభూమి

జట్టు కుదుటపడుతున్నది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 25: చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో, కోచ్ లేకుండానే విండీస్ టూర్‌కు వచ్చిన టీమిండియా కుదుటపడుతున్నదని జట్టు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ అన్నాడు. కుంబ్లే లేకపోవడం లోటేనని ఆదివారం వెస్టిండీస్‌తో రెండో వనే్డ ఆరంభానికి ముందు విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. అయితే, ఆటగాళ్లంతా సమష్టిగా నిలిచి, లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఇలాంటి అనుకోని సంఘటనలు చాలా సామాన్యమని, కాబట్టి, చాలా తక్కువ కాలంలోనే సమస్యను అధిగమిస్తారని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, బిసిసిఐ తనకు అప్పచెప్పిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపాడు. సవాళ్లు ఎదురైనప్పుడు, వాటిని ఎదిరించి నిలవడమే సిసరైన ప్రొఫెషనలిజం అనిపించుకుంటుందని వ్యాఖ్యానించాడు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా, ముందుకు సాగిపోవాల్సిన అవసరం ఉందన్నాడు. కుంబ్లే హెడ్ కోచ్‌గానే కాకుండా, బౌలింగ్ కోచ్‌గానూ సేవలు అందించిన నేపథ్యంలో, అతను లేకపోవడం వల్ల భారం పెరిగిందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, కొంత వరకూ అదీ నిజమేనని వ్యాఖ్యానించాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నారని, అందుకే, అదనపు భారాన్ని మోస్తున్నట్టు తాను భావించడం లేదని చెప్పాడు. వీరి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు. ఒకరితో ఒకరు చర్చించుకొని, అభిప్రాయాలను పంచుకుంటారని, దీనితో మైదానంలోకి దిగిన తర్వాత అప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి కష్టం ఉండదని బంగార్ అన్నాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, సంయమనం, పరస్పర అవగాహన అనేది కేవలం కోచ్, కెప్టెన్‌కు పరిమితం కాదని, జట్టులోని ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని అన్నాడు. ధోనీ, యువీ వంటి సీనియర్ల భవిష్యత్తు గురించి ప్రస్తావించగా, ఫిట్నెస్, ఫామ్ బాగా ఉన్నంతకాలం ఎవరైనా, ఎంతకాలమైనా కెరీర్‌ను కొనసాగించవచ్చని స్పష్టం చేశాడు.

చిత్రం.. సంజయ్ బంగార్