క్రీడాభూమి

వర్షంలోనే పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 17: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న 57వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో మూడోరోజైన సోమవారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి అథ్లెట్లు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ మొత్తానికి నిర్వాహకులు ఈవెంట్లు పూర్తి చేశారు. మరోపక్క వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందాన్ని ఇక్కడే ఎంపిక చేయనున్న నేపధ్యంలో అథ్లెట్లు తప్పనిసరై ఈవెంట్లలో బిక్కుబిక్కుమంటూ పాల్గొన్నారు. ఎక్కడ జారిపడి గాయాలపాలై కెరీర్‌కు దూరం అవుతామో అనే భయంతోనే అథ్లెట్లందరూ పోటీల్లో పాల్గొనటం గమనార్హం. ట్రాక్‌లో అక్కడక్కడ వర్షపునీరు నిలిచినప్పటికీ యూనివర్సిటీల్లోని వ్యాయామ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎప్పటికప్పుడు నీటిని ట్రాక్ నుంచి తొలగిస్తూ ఈవెంట్ల నిర్వహణ క్రమపద్ధతిలో జరిగే విధంగా తోడ్పాటు అందించారు. ఈవెంట్ల నిర్వహణకు మరొక ప్రత్యామ్నాయ ప్రదేశం లేకపోవడంతో వర్షపు జల్లులోనే నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చాలామంది అథ్లెట్లు యూనివర్సిటీలోని ఇండోర్ స్టేడియంలో వార్మప్ చేసుకుని ఈవెంట్లలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అఫిషియల్స్, ప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మొత్తానికి సింథటిక్ ట్రాక్ కావడంతో ఈవెంట్లను గట్టెక్కించారు.
కష్టమంతా వారిదే...
57వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వ్యాయామ విద్య కళాశాల విద్యార్థులు సుమారు 200 మంది సైనికుల మాదిరిగా పనిచేస్తూ చాంపియన్‌షిప్‌ను విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వారికిచ్చిన విధుల నిర్వహణ కంటే కూడా సమయస్ఫూర్తితో పనిచేసి ఔరా అనిపించారని చెప్పక తప్పదు.

చిత్రం.. సింథటిక్ ట్రాక్‌పై వర్షపు నీటిని తొలగిస్తున్న దృశ్యం