క్రీడాభూమి

డాన్స్‌పై డైలమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: కళ్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్ మధ్య, అతిరథ మహారథులు హాజరైన వింబుల్డన్ డిన్నర్‌లో డాన్స్ చేయాలా? వద్దా? అన్న మీమాంస ఈ ఏడాది చాంపియన్లు రోజర్ ఫెదరర్, గార్బెనె ముగురుజాను వేధించింది. నిరుడు డిన్నర్ కార్యక్రమంలో అప్పటి విజేతలు ఆండీ ముర్రే, సెరెనా విలియమ్స్ స్టెప్స్ వేసి ఆహూతులను అలరించారు. చాలా మంది యువ ప్లేయర్లు వారితో కలిసి డాన్స్ చేశారు. ప్రపంచ మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వంటి ఆటగాళ్లు జయాపజయాలతో సంబంధం లేకుండా, ప్రతి టోర్నమెంట్‌లోనూ డాన్స్‌లో తమ నైపుణ్యాన్ని చాటుతునే ఉంటారు. జొకోవిచ్, సెరెనా స్టెప్పులు టెన్నిస్ ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించాయి. గత ఏడాది ముర్రే, సెరెనా నెలకొల్పిన సంప్రదాయాన్ని అనుసరించి తాము కూడా డాన్స్ చేయాలా లేక డాన్స్ జోలికి వెళ్లకుండా హుందాగా ప్రవర్తించాలా అనే ప్రశ్నలు ఫెదరర్, ముగురుజాను వేధించాయి. అయితే, గంతులకు, డాన్సులకు ఎప్పుడూ దూరంగా ఉండే ఫెదరర్ తన పంథానే కొనసాగించాడు. నిజానికి వింబుల్డన్ పురుషులు, మహిళల విభాగాల్లో టైటిళ్లు సాధించిన వారు కలిసి డాన్స్ చేసి, తమ విజయాలను సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంతోకాలంగా ఇది వింబుల్డన్ డిన్నర్‌లో భాగమైంది. 1970 దశకం ఆరంభంలో డాన్స్ చేసే ఆనవాయితీకి బ్రేక్ పడింది. కానీ, ఆతర్వాత మళ్లీ మొదలైంది. గత ఏడాది కూడా విజేతలు ముర్రే, సెరెనా డాన్స్‌తో ఆకట్టుకున్నారు. కానీ, ఈసారి ఫెదరర్, ముగురుజా నృత్యం జోలికి వెళ్లకుండా ఫొటోలకు ఫోజులిస్తే సమయాన్ని గడిపేశారు.