క్రీడాభూమి

ఈ స్థాయిని ఊహించలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: వింబుల్డన్‌లో ఈ స్థాయిని అందుకుంటానని, ఎనిమిది టైటిళ్లు సాధిస్తానని తాను కలలో కూడా అనుకోలేదని రోజర్ ఫెదరర్ అన్నాడు. ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నందుకు నవ్వుకోవద్దని, తాను నిజంగానే ఈ స్థాయిని ఊహించలేదని చెప్పాడు. 16 సంవత్సరాల క్రితం పీట్ సంప్రాస్‌ను ఓడించి, మొదటిసారి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అందుకున్న విషయాన్ని అతను గుర్తుచేసుకున్నాడు. ఎనిమిది టైటిళ్లు సాధిస్తానని తాను అప్పట్లో అనుకోలేదని, నిజానికి అసలు ఆ ఆలోచన కూడా తనకు రాలేదని కెరీర్‌లో 19వ గ్రాండ్ శ్లామ్ టైటిల్ అందుకున్న ఫెదరర్ అన్నాడు. ఎనిమిది టైటిళ్లను దృష్టిలో ఉంచుకొని ఎవరూ కెరీర్‌ను కొనసాగించరని, ఈ అద్భుతాన్ని సాధించేందుకు తల్లిదండ్రులు, కోచ్‌ల సహాయసహకారాలు అవసరమవుతాయని తెలిపాడు.

చిత్రం.. మహిళల చాంపియన్ గార్బెనె ముగురుజాతో ఫొటోలకు ఫోజులిస్తున్న వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత
రోజర్ ఫెదరర్