క్రీడాభూమి

కోట్లా ఏం చేస్తుందో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో, చివరి టెస్టులో అందరి దృష్టి ఆటగాళ్ల కంటే ఎక్కువగా పిచ్‌పై కేంద్రీకృతమైంది. మొహాలీ వికెట్‌పై పరుగులు రాబట్టుకోవడం కష్టంకాగా, వికెట్లు పేకముక్కల్లా కూలాయి. బెంగళూరు టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసినప్పటికీ, ఆట సాధ్యమైన ఒక్క రోజే 12 వికెట్లు పడ్డాయి. నాగపూర్ టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగిసింది. వనే్డలను తలపిస్తూ టెస్టులు వేగంగా ముగియడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మెట్స్ కారణంగా దెబ్బతిన్న టెస్టు క్రికెట్ ఇప్పుడు పిచ్‌ల తీరువల్ల మరింతగా సమస్యల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. గత మూడు టెస్టుల్లోనూ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడం, లోస్కోరింగ్ మ్యాచ్‌లు నమోదు కావడంతో ఫిరాజ్ షా కోట్లా మైదానం ఏ విధంగా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టుల్లో దక్షిణాఫ్రికా వికెట్లు 50 కూలాయి. వాటిలో 47 స్పిన్నర్ల ఖాతాల్లోకే వెళ్లాయి. అశ్విన్ 24 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రవీంద్ర జడేజాకు 16, అమిత్ మిశ్రాకు ఏడు చొప్పున వికెట్లు లభించాయి. అశ్విన్, జడేజాలతో పోలిస్తే పిచ్ స్వభావాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో అమిత్ మిశ్రా అంతగా సఫలం కాలేదు. అతను ఎక్కువగా ఆఫ్ స్టంప్స్‌పైనే బంతులను సంధించడంతో అనుకున్నంత ఫలితాన్ని రాబట్టుకోలేకపోయాడు. అయితే, స్థూలంగా చూస్తే స్పిన్నర్ల ఆధిపత్యం ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ స్పష్టంగా కనిపించింది. నాగపూర్ టెస్టులో టీమిండియా స్పిన్నర్లు విశ్వరూపాన్ని ప్రదర్శించారు. కోట్లా మైదానంపై బంతి అదే విధంగా స్పిన్ అవుతుందని చెప్పలేకపోయినా, పేసర్లకంటే స్పిన్నర్లకు అనుకూలించడం ఖాయం. ఇదే మైదానంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ మానన్ శర్మ రంజీ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఇది జడేజాకు శుభవార్తే అవుతుంది. ఇంత వరకూ భారత్ పూర్తయిన ఇన్నింగ్స్ నాలుగు ఆడింది. మురళీ విజయ్, చటేశ్వర్ పుజారాను మినహాయిస్తే ఎవరూ అర్ధ శతకాలను సాధించలేకపోయారు. మురళీ విజయ్ నాలుగు ఇన్నింగ్స్‌లో 195 పరుగులు చేయగా, పుజారా 160 పరుగులు సాధించాడు. మిగతా వారు వచ్చిన వేగంగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగితంపై చూస్తే, కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే, రోహిత్ శర్మ వంటి స్టార్లు కనిపిస్తారు. అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లలో ఒకటిగా భారత్ గుర్తింపు సంపాదించింది. కానీ, ఈ సిరీస్‌లో భారీ స్కోరు సాధించలేకపోతున్నది. బౌలర్ల ఆధిపత్యం, బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఏ విధంగా కొనసాగుతున్నాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ.
స్పిన్‌తో సఫారీలు బెంబేలు
భారత స్పిన్ దాడిని ఎదుర్కోలేక దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తుతున్నారు. కెప్టెన్ హషీం ఆమ్లా, ఎబి డివిలియర్స్, స్టియాన్ వాన్ జిల్, ఫఫ్ డు ప్లెసిస్, ఎబి డివిలియర్స్ వంటి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ సైతం భారత స్పిన్‌కు దాసోహమంటున్నారు. బౌలింగ్ విభాగం కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది. ప్రపంచ నంబర్ వన్ డేల్ స్టెయిన్ గాయం కాణంగా ఈ టెస్టులో ఆడడం లేదు. మరో పేసర్ వెర్నన్ ఫిలాండ్ గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా బౌలింగ్ భారం యావత్తు మోర్న్ మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్ భుజాలపై పడింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే భారత్ కైవసం చేసుకోవడంతో చివరి టెస్టుకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. అయితే, పిచ్‌లపై చెలరేగుతున్న దుమారం కోట్లాలోనూ కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆటపై ధ్యాస పెట్టడం లేదు. ఈ టెస్టు ఎన్ని రోజుల్లో ముగుస్తుందోనని పందాలు కట్టుకుంటున్నారు. పిచ్‌ల పరిస్థితి అంత దారుణంగా మారింది.
(మ్యాచ్ గురువారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది),

చిత్రం... ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా ఫుట్‌బాల్ ఆడుతున్న
చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్

దక్షిణాఫ్రికా జట్టు కోట్లా మైదానంలో ఇప్పటి వరకూ ఒక్క టెస్టు కూడా ఆడలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. గతంలో ఐదు పర్యాయాలు భారత్ పర్యటనకు వచ్చినప్పటికీ, కోట్లా మైదానంలో మ్యాచ్ ఆడే అవకాశాన్ని సఫారీలు దక్కించుకోలేకపోయారు. అయితే, 2011 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఈ జట్టు కోట్లా మైదానంలో మ్యాచ్ ఆడింది. అందులో ఎబి డివిలియర్స్ 105 బంతులు ఎదుర్కొని, అజేయంగా 107 పరుగులు సాధించి దక్షిణాఫ్రికాను గెలిపించారు.

దక్షిణాఫ్రికాతో గురువారం నుంచి ప్రారంభంకానున్న చివరి, మూడో టెస్టుకు సిద్ధమవుతున్న టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్. బుధవారం వీరంతా నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు.

* ఢిల్లీలో జరిగిన టెస్టుల్లో, చివరి ఇన్నింగ్స్‌లో ఒక్కో వికెట్‌కు సగటున 40.87 పరుగులు జత కలిశాయి. ఐదు లేదా అంతకంటే ఎక్కువ టెస్టులకు ఆతిథ్యమిచ్చిన కేంద్రాల్లో ఇదే అత్యుత్తమ విశే్లషణ. ఈ మైదానంలో 17 పర్యాయాలు చివరి ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించేందుకు జట్టు ప్రయత్నించాయి. వాటిలో 11 పర్యాయాలు ఛేజింగ్ విజయవంతమైంది. కేవలం రెండసార్లు మాత్రమే ఛేజింగ్ చేయడంలో జట్లు విఫలమయ్యాయి. మిగతా నాలుగు సార్లు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
* కోట్లా మైదానంలో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 32 టెస్టుల్లో, టాస్ గెలిచిన కెప్టెన్లు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించారు. అయితే, టాస్ గెలిచిన జట్టు మ్యాచ్‌లోని గెల్చుకున్న సందర్భాలు ఐదు మాత్రమే.
* ఈ సిరీస్‌లో స్పిన్నర్లు ఇంత వరకూ 75 వికెట్లు కూల్చారు. ఢిల్లీ టెస్టులో మరో 35 వికెట్లు పడగొడితే, టెస్టు క్రికెట్ చరిత్రలోనే స్పిన్నర్లు అత్యద్భుతంగా రాణించిన సిరీస్‌గా రికార్డు సృష్టిస్తుంది.

ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో పేస్ బౌలర్లకు కేవలం రెండు వికెట్లు మాత్రమే లభించాయి. ఢిల్లీ టెస్టులో స్పిన్నర్ల జోరు కొనసాగి, పేసర్లకు వికెట్లు దక్కకుంటే, టెస్టు క్రికెట్‌లో స్పిన్నర్ల హవా కొనసాగిన సిరీస్‌గా రికార్డుల్లోకి ఎక్కుతుంది. 1972-73 సీజన్‌లో ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడినప్పుడు పేసర్లకు మూడు వికెట్లే దక్కాయి.

భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మకు కోట్లా మైదానం హోం గ్రౌండ్. ఇక్కడ 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను 50 వికెట్లు కూల్చాడు. గత పదేళ్ల కాలంలో కోట్లా మైదానంలో ఏ బౌలర్ కూడా ఇన్ని వికెట్లు పడగొట్టలేదు. మిగతా మైదానాల్లో ఇశాంత్ 20 వికెట్లు కూడా సాధించలేకపోవడం గమనార్హం. కోట్లా మైదానంలోనే అతను చెలరేగి బౌలింగ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

భారత్, దక్షిణాఫ్రికా చివరి టెస్టు కోసం తుది మెరుగులు దిద్దుకుంటున్నఫిరోజ్ షా కోట్లా పిచ్.
దీని తీరు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.