క్రీడాభూమి

ఆరు బంతుల్లో ఆరు వికెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదర్లాండ్ (ఇంగ్లాండ్), ఆగస్టు 12: ఫిలడెల్ఫియా క్రికెట్ క్లబ్ ఆటగాడు, 13 ఏళ్ల టీనేజర్ ల్యూక్ రాబిన్సన్ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు కూల్చి సంచలనం సృష్టించాడు. హ్యూటన్ లె స్ప్రింగ్‌లో జరిగిన అండర్-13 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లో అతను ఈ అరుదైన ఫీట్‌ను ప్రదర్శించి, తన జట్టును విజయపథంలో నడిపాడు. ల్యూక్ సోదరుడు మాథ్యూ కూడా అదే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను ఫీల్డింగ్ చేస్తుండగా, తల్లి హెలెన్, తండ్రి స్టెఫెన్, తాతా గ్లేన్ ఆ మ్యాచ్‌ని తిలకించారు. ల్యూక్ ఒకే ఓవర్‌లో, ఆరు బంతుల్లో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా, ఆ దృశ్యాలను హెలెన్ తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసింది. ల్యూక్ సాధించిన అరుదైన రికార్డుపై అతని తండ్రి స్టెఫెన్ ఆనందం వ్యక్తం చేశాడు. తాను సుమారు 30 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నానని, కానీ, ఒక బౌలర్ ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు కూల్చడం ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించాడు.